ETV Bharat / bharat

అశ్లీల వీడియోలు చూడలేదు: కర్ణాటక ఎమ్మెల్సీ

కర్ణాటక శాసన మండలి సమావేశాల్లో తన సెల్​ఫోన్​లో అశ్లీల వీడియోలు చూస్తున్నారన్న ఆరోపణలను కాంగ్రెస్​ ఎమ్మెల్సీ ప్రకాశ్​ రాథోడ్​ తోసిపుచ్చారు. తానెప్పుడూ అలాంటివి చూడలేదని వివరణ ఇచ్చుకున్నారు.

Congress MLC caught viewing mobile gallery in council Session, The gallery contained Porn videos too.
అశ్లీల వీడియోలు చూడలేదు: కర్ణాటక ఎమ్మెల్సీ
author img

By

Published : Jan 29, 2021, 8:12 PM IST

శాసన మండలి సమావేశాల్లో అశ్లీల వీడియోలు చూడలేదని కర్ణాటక కాంగ్రెస్​ ఎమ్మెల్సీ ప్రకాశ్​ రాథోడ్​ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన.. తానెప్పుడూ అలాంటివి చూడలేదన్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రిని అడగాల్సిన 7వ ప్రశ్నకు సంబంధించిన వివరాలు సెల్​ఫోన్​లో ఉన్నట్లు తెలిపారు. అందుకే ఆ సమయంలో తాను ఫోన్​ చూడాల్సి వచ్చిందన్నారు.

అదే సమయంలో తన మొమోరీ నిండినట్లు కనిపించిందని.. వెంటనే అవసరం లేని కొన్ని ఫొటోలు, వీడియోలు డిలీట్​ చేసే క్రమంలో రికార్డ్​ అయిన వీడియో కనిపించి ఉండొచ్చన్నారు. సాధారణంగా ఫోన్​ను ఎక్కువగా ఉపయోగించనని.. ఈ విషయాన్ని వివాదం చేయొద్దని కోరారు.

సాధారణంగా నా మొబైల్‌కు వేల సందేశాలు వస్తుంటాయి. వాటిని చూసేందుకే సమయం ఉండదు. ఇలాంటి అశ్లీల వీడియోలను ఎప్పుడూ చూడనే లేదు. మంత్రిని ప్రశ్న అడగాలనుకున్నా. నా ప్రశ్న మొబైల్ ఫోన్‌లో ఉంది. దాన్ని చూడటానికి మొబైల్ తీసుకున్నా.

-ప్రకాశ్​ రాథోడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

ఇదీ చదవండి: హైటెక్​ డివైజ్​ సాయంతో ఏటీఎం లూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.