Congress Manifesto for Punjab polls: పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి వస్తే.. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ తొలి నిర్ణయమని కాంగ్రెస్ ప్రకటించింది. ఫిబ్రవరి 20న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది.
మహిళలకు నెలనెలా రూ. 1100 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్.
సంవత్సరానికి 8 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని వెల్లడించింది.
-
The single point aim of Congress party is development of Punjab to its maximum.
— Punjab Congress (@INCPunjab) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
The 12 point agenda of upcoming Congress govt of Punjab will take care of the needs of each and every Punjabi.#CongressHiAyegi pic.twitter.com/4Ky97EisbF
">The single point aim of Congress party is development of Punjab to its maximum.
— Punjab Congress (@INCPunjab) February 16, 2022
The 12 point agenda of upcoming Congress govt of Punjab will take care of the needs of each and every Punjabi.#CongressHiAyegi pic.twitter.com/4Ky97EisbFThe single point aim of Congress party is development of Punjab to its maximum.
— Punjab Congress (@INCPunjab) February 16, 2022
The 12 point agenda of upcoming Congress govt of Punjab will take care of the needs of each and every Punjabi.#CongressHiAyegi pic.twitter.com/4Ky97EisbF
Navjot Singh Sidhu: ఏడాదికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్‌సింగ్ సిద్ధూ. పార్టీ 13- పాయింట్ల అజెండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుల పండించే నూనెగింజలు, మొక్కజొన్న, పప్పులను ప్రభుత్వమే సేకరిస్తుందని సిద్ధూ హామీ ఇచ్చారు.
''మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాల కోసం కార్పొరేషన్లను ఏర్పాటుచేసి మాఫియాను అంతమొందిస్తాం. గృహిణులకు రూ. 1100 చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం.''
- నవజోత్‌సింగ్ సిద్ధూ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్
Punjab polls 2022: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శుక్రవారమే చివరి రోజు. 20న ఎన్నికలు నిర్వహించి.. మార్చి 10న ఫలితాలు వెలువరించనున్నారు. ప్రచారం చివరిరోజే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయడం విశేషం.
ఇవీ చూడండి: 'భాజపా గెలిస్తే స్టూడెంట్స్‌కు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఫ్రీ!'