ETV Bharat / bharat

దిగొచ్చిన యోగి సర్కార్‌.. లఖింపుర్​కు విపక్ష నేతలు - lakhimpur news today

ఎట్టకేలకు విపక్ష నేతలు లఖింపుర్‌ ఖేరి(Lakhimpur Kheri Incident) వెళ్లేందుకు అనుమతిచ్చింది ఉత్తర్​ప్రదేశ్ సర్కార్. అనంతరం కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక, రాహుల్‌ గాంధీ.. బాధిత కుటుంబాలను ఓదార్చారు. అంతకుముందు లఖింపుర్‌ ఖేరి వెళ్లేందుకు లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi news) , కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ, భూపేశ్‌ బఘేల్‌లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనంలోనే వెళ్లాలని షరతు పెట్టడంతో రాహుల్‌ ధర్నాకు దిగారు. చివరికి సొంత వాహనాల్లో వెళ్లేందుకు అధికారులు అనుమతించారు.

Lakhimpur Kheri Incident
లఖింపుర్​
author img

By

Published : Oct 7, 2021, 5:23 AM IST

ఎనిమిది మంది మృతికి కారణమైన లఖింపుర్‌ ఖేరి(Lakhimpur Kheri Incident) ఘటన విషయంలో ఎట్టకేలకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం దిగొచ్చింది. విపక్ష నేతలు అక్కడ పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అనుమతించింది. అధికారులతో సుదీర్ఘ మంతనాల అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మూడు రోజులుగా సీతాపుర్‌ అతిథిగృహంలో నిర్బంధంలో ఉన్న ప్రియాంక, ఇతర నేతలు విడుదలయ్యారు. అంతకుముందు లఖింపుర్‌ ఖేరి(Lakhimpur Kheri News) వెళ్లేందుకు లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi news), కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ, భూపేశ్‌ బఘేల్‌లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనంలోనే వెళ్లాలని షరతు పెట్టడంతో రాహుల్‌ ధర్నాకు దిగారు. చివరికి సొంత వాహనాల్లో వెళ్లేందుకు అధికారులు అనుమతించారు.

rahul and priyanka
బాధిత కుటుంబాలను ఓదారుస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్‌ నేతలు అక్కడి నుంచి బయల్దేరి... సీతాపుర్‌లో ప్రియాంక వద్దకు చేరుకున్నారు. ఆమెతో కలిసి లఖింపుర్‌ ఖేరికి బయల్దేరి వెళ్లారు. బాధిత కుటుంబాలను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్ర.. అమిత్‌ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అలాంటిదేమీ లేదని అధికార వర్గాలు కొట్టిపారేశాయి.

నియంతృత్వ పాలన: రాహుల్‌

దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, రైతులపై ఓ పద్ధతి ప్రకారం దాడులు జరుగుతున్నాయని దిల్లీలో విలేకరుల వద్ద రాహుల్‌గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తర్వాత ఆయనతో పాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు కె.సి.వేణుగోపాల్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, అక్కడి నుంచి వారు సొంత వాహనాల్లో లఖింపుర్‌ ఖేరికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చుట్టుముట్టడంతో రాహుల్‌ ధర్నాకు దిగారు.

"దగాపడ్డ రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే.. మమ్మల్ని అడ్డుకుంటున్నారు. యూపీ సర్కారు ఇచ్చిన అనుమతులు ఎలా ఉన్నాయో చూడండి! నన్ను సొంత వాహనంలో వెళ్లనిచ్చేవరకూ ఇక్కడే కూర్చుంటా" అని ఆయన భీష్మించారు. ఆయన పర్యటనకు తొలుత అనుమతివ్వని యూపీ ప్రభుత్వం ఆ తర్వాత- రాహుల్‌, ప్రియాంకలతో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్‌ నేతలు మాత్రమే లఖింపుర్‌ ఖేరి వెళ్లేందుకు అంగీకరించింది.

కాంగ్రెస్‌ సీఎంల భారీ ఆర్థిక సాయం

హింసాత్మక ఘటనలో మృతిచెందిన నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు కుటుంబానికి చెరో రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు పంజాబ్‌ సీఎం చన్నీ, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి బఘేల్‌లు ప్రకటించారు. కాంగ్రెస్‌ నేతలు లఖ్‌నవూ విమానాశ్రయం చేరుకోవడానికి ముందే... రాహుల్‌, ప్రియాంకలకు వ్యతిరేకంగా అక్కడ పోస్టర్లు వెలిశాయి. 1984 నాటి సిక్కు అల్లర్లకు సంబంధించిన అంశాలను ఇందులో ఉదహరించారు. లఖింపుర్‌ ఖేరి ఘటనపై విచారణకు అదనపు ఎస్పీ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

అమిత్‌ షాతో అజయ్‌ మిశ్ర భేటీ

అజయ్‌ మిశ్ర లఖింపుర్‌ ఖేరి ఘటన తర్వాత తొలిసారిగా బుధవారం తన కార్యాలయానికి వచ్చారు. హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. అనంతరం మిశ్ర మాట్లాడారు. ‘‘హింస చెలరేగినప్పుడు నేను, నా కుమారుడు ఆ ప్రాంతంలో లేం. దీనిపై ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా సీతాపుర్‌లో నిర్బంధించిన తన భార్య ప్రియాంక వద్దకు వెళ్లకుండా తనను పోలీసులు అడ్డుకున్నారని ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు.

నేడు సుప్రీంకోర్టు విచారణ

సీజేఐ జస్టిస్‌ రమణ ధర్మాసనం ఆధ్వర్యంలో..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశం విచారణకు రానుంది. 8 మంది ప్రాణాలను బలిగొన్న హింసాత్మక ఘటనలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా అనే ఇద్దరు న్యాయవాదులు సీజేఐ జస్టిస్‌ రమణకు లేఖ రాశారు.

దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టేలా కేంద్రహోంశాఖకు ఆదేశాలు జారీ చేయాలని, ఈ హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారికి చట్టపరంగా శిక్షపడేలా చూడాలని వారు కోరారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఇదీ చదవండి: 'కేంద్రమంత్రి రాజీనామాతోనే బాధితులకు న్యాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.