ETV Bharat / bharat

'పీకే.. రాజకీయం అంటే ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు' - పీకేపై సల్మాన్‌ ఖుర్షిద్‌

Salman Khurshid on Prashant Kishor: కాంగ్రెస్​ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)​ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్‌ ఖుర్షిద్‌ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి తెలియకపోతే ​పాఠశాలకెళ్లి పీకే చదువుకోవాలని హితవు పలికారు. రాజకీయం అంటే ఎన్నికల్లో గెలవడమే మాత్రమే కాదని పేర్కొన్నారు.

Salman Khurshid on  Prashant Kishor, pk tweet on congress
పీకేపై సల్మాన్ ఖుర్షిద్​
author img

By

Published : Dec 4, 2021, 7:52 AM IST

Salman Khurshid on Prashant Kishor: కాంగ్రెస్‌ పార్టీని, రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యలు.. జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. విపక్ష కూటమికిగానీ, కాంగ్రెస్‌కుగానీ అధ్యక్షత వహించడం ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన హక్కు ఏమీ కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్ణయించుకోవాలని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌కు ప్రజాస్వామ్యం గురించి తెలియకపోతే పాఠశాలకెళ్లి చదువుకోవాలని తాజాగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షిద్‌ ట్విటర్‌ వేదికగా హితవు పలికారు.

"ప్రజాస్వామ్యం పట్ల పీకే(ప్రశాంత్‌ కిశోర్‌)కి చాలా ఆసక్తి ఉన్నట్లు ఉంది. కాంగ్రెస్ కార్యకర్తల ప్రజాస్వామిక ఎంపికను ప్రశ్నించేందుకు ఆయన దైవత్వాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు చదివి తెచ్చుకున్న జ్ఞానం మానవ ప్రవర్తనను ప్రభావితం చేయదని అర్థమవుతోంది. రాజకీయం అంటే ఎన్నికల్లో గెలవడమే మాత్రమే కాదు. ఈ విషయం వ్యాపారం చేసే వాళ్లకు ఎలా తెలుస్తుంది?"

-సల్మాన్‌ ఖుర్షిద్‌, కాంగ్రెస్ సీనియర్ నేత

దైవత్వం, ప్రజాస్వామ్యం అనేవి విశ్వాసానికి సంబంధించినవని, ప్రజాస్వామ్యాన్ని ఇతరులెవరూ నిర్వచించలేరని సల్మాన్‌ అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కాకపోతే, పాఠశాలకెళ్లి మళ్లీ చదువుకోవడం ప్రారంభించాలని ప్రశాంత్‌ కిశోర్‌కు సల్మాన్‌ సూచించారు.

Pawan khera on prashant kishor: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా కూడా పీకే ట్వీట్‌పై ట్విటర్‌లోనే స్పందించారు. "సిద్ధాంతాల పట్ల ఎలాంటి నిబద్ధత లేకుండా రాజకీయమే వృత్తిగా గల ఓ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే విషయాలపై ఎవరికైనా సలహాలు ఇచ్చుకోవచ్చు. కానీ, మన రాజకీయాలు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించలేరు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్‌గాంధీ ‘దైవిక కర్తవ్యా’న్ని నిర్వహిస్తున్నారు" అని పవన్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: 'దేశంలో యూపీఏ కూటమే లేదు.. ప్రత్యామ్నాయం అవసరం'

ఇదీ చూడండి: Mamata Vs Congress: టీఎంసీ, కాంగ్రెస్ ఫైట్- భాజపా సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.