కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన సాగు చట్టాల విషయంలో ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు సన్నద్ధమవుతోంది కాంగ్రెస్. ఈ మేరకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్షాలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో.. భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తోంది కాంగ్రెస్. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై చర్చించేందుకు విపక్ష నాయకులతో ఆమె త్వరలోనే భేటీ కానున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: 'గాడ్సే' లైబ్రరీ ప్రారంభించిన హిందూ మహాసభ