ETV Bharat / bharat

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా​ ఖర్గే! - రాజ్యసభ

రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా మల్లికార్జున్​ ఖర్గే పేరును ప్రతిపాదించింది కాంగ్రెస్​. ఈనెల 15న గులాం నబీ ఆజాద్​ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Mallikarjun Kharge
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున్​ ఖర్గే!
author img

By

Published : Feb 12, 2021, 10:50 AM IST

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్​ ఈనెల 15న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రతిపక్ష నేత ఎంపికకు సిద్ధమైంది కాంగ్రెస్​. తమ పార్టీ తరఫున సీనియర్​ నేత మల్లికార్జున్​ ఖర్గే పేరును ప్రతిపాదించింది. తమ ప్రతిపాదనను రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడుకు సమర్పించింది​.

ఆజాద్​ స్థానాన్ని భర్తీ చేసేందుకు కాంగ్రెస్​ ముందుగా పలువురు సీనియర్​ నేతల పేర్లను పరిశీలించింది. ఆ జాబితాలో మల్లికార్జున్​ ఖర్గే, ఆనంద్​ శర్మ, దిగ్విజయ్​ సింగ్​, చిదంబరం, కపిల్​ సిబల్​ వంటి నేతలు ఉన్నారు. అన్ని విధాలుగా ఆలోచించి.. చివరకు మల్లికార్జున్​ ఖర్గే పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ముందు నుంచి ఖర్గే వైపే!

కాంగ్రెస్​కు నమ్మిన బంటుగా ఉంటున్న సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేతగా బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మొదటి నుంచి పార్టీ వర్గాలు భావించాయి. రాహుల్​ గాంధీతో సాన్నిహిత్యం, దళిత నేత కావడం మొదలైన అంశాలు ఖర్గే వైపు ముగ్గు చూపేలా చేస్తాయని.. ఆయనకు పదవిని అప్పగిస్తే పార్టీకి ఉపయోగమేనని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: రాజకీయ భవితవ్యంపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.