ETV Bharat / bharat

'అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన'- ''ఇండియా' ఐక్యతతో బీజేపీ కనుమరుగు' - కాంగ్రెస్​ వ్యవస్థాపకదినం

Congress Foundation Day : సార్వత్రిక ఎన్నికల సమరానికి శంఖం పూరించింది కాంగ్రెస్. ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ర్యాలీని ఏర్పాటు చేసింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామన్నారు.

Congress Foundation Day :
Congress Foundation Day :
author img

By PTI

Published : Dec 28, 2023, 6:10 PM IST

Updated : Dec 28, 2023, 6:54 PM IST

Congress Foundation Day : కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామన్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో నిరుద్యోగ రేటు గత 40 ఏళ్లలో అత్యధిక శాతానికి చేరుకుందని ఆరోపించారు. దేశంలో రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్​ 139వ వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నాగ్​పుర్​లో 'హై తయార్​ హమ్​' (మేం సిద్ధంగా ఉన్నాం) పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

  • VIDEO | "There is a war between two ideologies. There are several parties in NDA and INDIA alliance, but the war is between two ideologies," says Congress leader @RahulGandhi during party's 'Hain Tayyar Hum' rally in Nagpur. pic.twitter.com/ectlOYCZco

    — Press Trust of India (@PTI_News) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇది(నాగ్​పుర్) కాంగ్రెస్‌ పార్టీ గడ్డ. ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్‌ సిద్ధాంతాల గురించి చెప్పకపోయినా అర్థమవుతాయి. కాంగ్రెస్‌ పోరాటం మహారాష్ట్ర నుంచే మొదలైంది, అందువల్ల మీతో మాట్లాడేందుకు నాగ్‌పుర్‌ వచ్చాం. మీరు ఎవరికీ భయపడకూడదు. సిద్ధాంతాల కోసం మనస్ఫూర్తిగా చేస్తున్న పోరాటం ఇది. మనమంతా కలిసి మహారాష్ట్రతోపాటు దేశంలో జరిగే ఎన్నికల్లో గెలవబోతున్నాం."
-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు

'ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాన్ని బలపరచాలి'
ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే దేశంలో భారతీయ జనతా పార్టీ కనుమరుగవుతుందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్ష కూటమిని బలపర్చాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్‌ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగ్‌పుర్‌లో నిర్వహించిన హై తయ్యార్‌ హమ్‌ ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. పార్లమెంటులో అలజడికి సంబంధించి బీజేపీ తమ ఎంపీని కాపాడేందుకు 147 మంది ప్రతిపక్ష ఎంపీలను బయటికి పంపిందని ఖర్గే ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధిస్తే మహిళలకు సాధికారత కల్పించే న్యాయ్‌ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. అంతకుముందు దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఖర్గే.

"కాంగ్రెస్‌, ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటుకు రావటం లేదని మోదీ ఆరోపిస్తున్నారు. మీరే మమ్మల్ని పార్లమెంటు నుంచి బయటికి వెళ్లగొట్టారు కదా. మమ్మల్ని మాట్లాడనివ్వరు. కొంతమంది పార్లమెంటులోకి ప్రవేశించారు, వారు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వారి వెనుక ఎవరు ఉన్నారని మాత్రమే మేం ప్రశ్నించాం. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ ఎంపీ ఉండి ఉంటే మమ్మల్ని కళంకితులని బద్నాం చేసేవారు. బీజేపీకి చెందిన ఒక ఎంపీని కాపాడేందుకు 147మంది ఎంపీలను బయటికి పంపారు."
--మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు

  • #WATCH | At Congress' 'Hain Taiyyar Hum' rally, party president Mallikarjun Kharge says,"...There are two ideologies in Nagpur. One ideology is progressive, which belongs to Baba Saheb Ambedkar. On the other side is RSS, which is destroying the nation." pic.twitter.com/0PgPNgrKrO

    — ANI (@ANI) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

14రాష్ట్రాలు, 6200 కి.మీ- రాహుల్​ 'భారత్ న్యాయ్ యాత్ర'- ఎప్పటినుంచంటే?

'ఇండియా' కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్​ బ్లూప్రింట్​! అన్ని రాష్ట్రాల నేతలతో కమిటీ భేటీ

Last Updated : Dec 28, 2023, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.