ETV Bharat / bharat

'కుంభకోణాలే కాంగ్రెస్ అసలైన​ హామీలు' - అసోంలో ఎన్​డీఏ

కుంభకోణాలకు పాల్పడటం మాత్రమే కాంగ్రెస్​ నుంచి ఆశించదగ్గ అసలైన హామీ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. అసోంలో తిరిగి ఎన్​డీఏ కూటమే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 35 సార్లు పర్యటిస్తే.. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్​ పది సార్లు కూడా పర్యటించలేదని విమర్శించారు.

bjp president jp nadda
'స్కామ్​లు చేయటమే కాంగ్రెస్ అసలైన​ హామీ'
author img

By

Published : Apr 3, 2021, 11:23 AM IST

కాంగ్రెస్​ ఎక్కడకు వెళితే.. అక్కడ కుంభకోణాలకు పాల్పడుతుందని ఆరోపించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అదే ఆ పార్టీ నుంచి ఆశించే అసలైన హామీ అని ఎద్దేవా చేశారు. అసోంలో మరోసారి ఎన్​డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ నేతృత్వంలోని మహాజోత్​ కూటమి ఇచ్చిన ఐదు హామీలపై ఆయన విమర్శలు గుప్పించారు.

"అసోంలో అధికారంలోకి వస్తే సీఏఏను అమలు కానివ్వబోమని వాళ్లు హామీ ఇస్తున్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఒక రాష్ట్రం ఎలా మార్చగలదు? ప్రజలను వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్​కు మరో పేరు అబద్ధం. వాళ్లు ఎక్కడికి వెళితే.. అక్కడ కుంభకోణాలకు పాల్పడుతారని నేను మీకు హామీ ఇస్తున్నాను."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

అసోంలోని ప్రతిపక్ష పార్టీ.. రాజకీయ పర్యటనలు చేస్తోందని నడ్డా విమర్శించారు. అసోంలో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం.. తేయాకు కార్మికుల ప్రయోజనం కోసం ఏమీ చేయలేదని అన్నారు.

'మన్మోహన్ ఎందుకు చేయలేదు?'

అసోంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 35 సార్లు పర్యటిస్తే.. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్​ సింగ్​ తన పదేళ్ల పదవీ కాలంలో పది సార్లు కూడా పర్యటించలేదని నడ్డా ఎద్దేవా చేశారు. గ్యాస్​ సబ్సిడీ కింద రూ.8,000 కోట్లు మోదీ కేటాయించారని, మన్మోహన్​ సింగ్​ ఎందుకు ఆ పని చేయలేకపోయారని ప్రశ్నించారు.

అసోంలో రూ.1,100 కోట్లకు పైగా ఖర్చుతో ఎయిమ్స్​ను తాము నిర్మిస్తున్నామని నడ్డా తెలిపారు. ఐదేళ్ల కాలంలో 6 వైద్య కళాశాలలను కేటాయించామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'దీదీని ఓడించేందుకు బంగాల్​ ప్రజలంతా ఏకం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.