ETV Bharat / bharat

దోస్తులతో కలిసి.. కమలం, హస్తం కుస్తీ!

త్వరలో జరగనున్న ఐదు శాసనసభల ఎన్నికల్లో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. ‌ఏ ఒక్క చోటా భాజపా, కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడటం లేదు. మిత్రపక్షాలతో కలిసే అవి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఆయా శాసనసభల వారీగా ఇరు పార్టీల పరిస్థితిని పరిశీలిస్తే..

congress and bjp
దోస్తులతో కలిసి.. కమలం, హస్తం కుస్తీ!
author img

By

Published : Mar 2, 2021, 9:44 AM IST

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ త్వరలో జరగనున్న ఐదు శాసనసభల ఎన్నికల్లో ఏ ఒక్క చోటా ముఖాముఖీ తలపడటం లేదు! మిత్రపక్షాలతో కలిసే అవి పోరుకు సమాయత్తమవుతున్నాయి. బంగాల్​‌ మినహా అన్ని చోట్లా పొత్తులతో భాజపా బరిలోకి దిగనుండగా.. కాంగ్రెస్‌ ఐదింటా మిత్రపక్షాలతో కలిసే పోరాటానికి సిద్ధమవుతోంది.

బంగాల్​- కోటాలో కోత తప్పదా?

రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించి, ఈ దఫా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కమలదళం పట్టుదలతో ఉంది. ఒంటరిగా పోరాటానికి సమాయత్తమయింది. అన్ని సీట్లలోనూ సొంతంగా అభ్యర్థులను పోటీకి దింపనుంది. కాంగ్రెస్‌ది మాత్రం ఇక్కడా కూటమి బాటే. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆ పార్టీ 98 స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు వారి కూటమిలో ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) భాగస్వామిగా చేరింది. కాబట్టి హస్తం పార్టీ పోటీ చేసే సీట్ల సంఖ్యలో కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడు- ఇచ్చిన సీట్లతో సరిపెట్టుకోవాల్సిందే!

ఇక్కడ 234 శాసనసభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌ రెండూ జూనియర్‌ భాగస్వాములే. అన్నాడీఎంకేతో కలిసి కమలదళం, డీఎంకేతో జట్టు కట్టి హస్తం పార్టీ బరిలో దిగనున్నాయి. ద్రవిడ పార్టీలు ఇచ్చిన సీట్లు తీసుకోవడం మినహా పెద్దగా డిమాండ్లు చేసే స్థితిలో ఆ పార్టీలు లేవు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కమలనాథులు ఒక్క సీటునూ గెల్చుకోలేకపోయారు. జైలు నుంచి శశికళ విడుదలైన నేపథ్యంలో అన్నా డీఎంకేలో అంతర్గత పోరు మరింత ముదురు తుందని, అది వారి కూటమిపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.

అసోం- కూటముల్లో పెద్దన్న పాత్ర

రాష్ట్రంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కమలదళం, హస్తం పార్టీ పరస్పరం ఒంటరిగా తలపడే పరిస్థితి లేదు. అయితే కూటములకు నాయకత్వ వహించే స్థితిలో ఉన్నాయి. అసోం గణ పరిషత్‌ (ఏజీపీ), ఐక్య ప్రజా విమోచన పార్టీ (యూపీపీఎల్‌)లతో భాజపా జట్టు కట్టింది. కాంగ్రెస్‌.. ఏఐయూడీఎఫ్‌, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌), సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌)లతో కలిసి 'మహాజోత్‌'ను ఏర్పాటు చేసింది. ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమిని ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్‌ (ఏజేపీ), రైజొర్‌ దళ్‌ కూటమిగా అవతరించాయి.

పుదుచ్చేరి- హస్తానికి అగ్రతాంబూలం

భాజపాది ఇక్కడా తమిళనాడు తరహా పరిస్థితే. బలమైన ఆల్‌ ఇండియా ఎన్‌ రంగస్వామి కాంగ్రెస్‌ (ఏఐఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌)తో కలిసి ఆ పార్టీ బరిలోకి దిగనుంది. కాబట్టి కూటమిలో దానికి దక్కేది ద్వితీయ ప్రాధాన్యతే! ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పలువురు కమలదళంలో చేరారు. దీంతో కూటమిలో కనీసం 10 స్థానాలను ఆ పార్టీ డిమాండ్‌ చేస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు- ఇక్కడ డీఎంకేతో కలిసి కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. కూటమిలో అగ్ర తాంబూలం హస్తం పార్టీకే. పుదుచ్చేరిలో మొత్తం 30 శాసనసభ స్థానాలు ఉన్నాయి.

కేరళ- ఉనికి కోసమే కమలం ఆరాటం

రాష్ట్రంలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ బలంగా ఉంది. తన ఉనికి చాటుకోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని భాజపా ప్రయత్నిస్తోంది. అధికారం కోసం పోరు మాత్రం కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్‌), సీపీఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్‌) మధ్యే సాగనుంది! మిత్రపక్షాలకు చెప్పుకోదగిన బలం ఉండటం వల్ల.. పొత్తుల్లో భాగంగా ఇక్కడ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 87 స్థానాల్లోనే పోటీ చేసింది. ఇప్పుడు కూడా అంతకు మించిన సీట్లలో బరిలో దిగే అవకాశాల్లేవు. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భాజపా కోరుకుంటోంది. 2016లో ఆ పార్టీ ఇక్కడ భారతీయ ధర్మ జనసేన (బీడీజేఎస్‌)తో జట్టు కట్టింది. అప్పట్లో 98 స్థానాల్లో పోటీ చేసిన భాజపా ఒకే ఒక్క స్థానాన్ని గెల్చుకోగా, బీడీజేఎస్‌ ఖాతా తెరవనే లేదు.

ఇదీ చూడండి:ఆ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై 'హస్తం' కుస్తీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.