ఒడిశా పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు (Ajay Mishra News) చేదు అనుభవం ఎదురైంది. భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి కటక్‌లోని సీఐఎస్ఎఫ్ క్యాంపస్‌కు వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్ యువజన కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు.



మంత్రి కాన్వాయ్‌ను ముందుకు పోనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిరసనగా.. నల్ల బ్యాడ్జ్‌లు ప్రదర్శించారు. మినిస్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.


అయితే ఇటీవల జరిగిన లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో (Lakhimpur Kheri Violence) కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అజయ్ మిశ్రా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాల మధ్య ఒడిశాకు చేరుకున్న కేంద్రమంత్రికి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి నిరసన సెగ తగిలింది.
ఇదీ చూడండి: వంద కోసం వార్డుబాయ్ కక్కుర్తి.. ముక్కుపచ్చలారని చిన్నారి బలి