ETV Bharat / bharat

'లఖింపుర్ ఘటనపై నిజాలు వినిపిస్తాం.. సమయమివ్వండి' - లఖింపుర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ నిరసనలు

లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri News) ఘటన, ఆపై చెలరేగిన రాజకీయ దుమారంపై 'వాస్తవాలను' రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు(Ramnath Kovind) సమర్పించనున్నట్లు కాంగ్రెస్(Congress Party) ప్రకటించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరింది.

Cong
కాంగ్రెస్
author img

By

Published : Oct 10, 2021, 4:20 PM IST

లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌కు 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట ఓ వినతిపత్రం సమర్పించనుంది కాంగ్రెస్. ఈ మేరకు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంకా గాంధీ వాద్రాలతో(Priyanka Gandhi Vadra) కూడిన ఏడుగురు సభ్యుల బృందానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా అక్టోబర్ 9న రాష్ట్రపతికి(President of India) ఓ లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్, ప్రియాంకతో పాటు.. సీనియర్ నాయకులు ఏకే ఆంటోనీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ఉండనున్నారు.

"ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్ ఖేరి ఘటన దేశ ప్రజలను కదిలించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రైతులను బహిరంగంగా బెదిరించారు. మంత్రి కుమారుడే తమపైకి వాహనం నడిపాపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు."

-రాష్ట్రపతికి రాసిన లేఖలో కాంగ్రెస్

'ఇది మామూలు నేరం కాదు..'

లఖింపుర్ ఖేరిలో జరిగిన హింస అత్యంత విషాదకరమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్(Salman Khurshid) అన్నారు. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే.. భారత ప్రజాస్వామ్యం వినాశకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇది కచ్చితంగా సాధారణ నేరం మాత్రం కాదు. ప్రత్యేక దుర్మార్గ వైఖరి కారణంగా జరిగిన దాడి. ప్రజాస్వామ్య నిరసన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జరిగిన నేరం"

-సల్మాన్ ఖుర్షీద్

'అది జాతి ఐక్యతకే ప్రమాదం..'

లఖింపుర్ ఖేరి ఘటనను "హిందూ-సిక్కుల మధ్య యుద్ధం"గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కథనాలపై భాజపా నేత, పీలీభిత్ ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi Latest News) స్పందించారు. ఈ తరహా తప్పులను ప్రోత్సహించడం మంచిదికాదని హెచ్చరించారు. దీనిని మానిపోయిన గాయాలను తిరిగి రేపడంగా అభివర్ణించారు. నిరసన తెలుపుతున్న రైతులకు 'ఖలిస్థానీ'(Khalistan Movement) అనే పదాన్ని ముడిపెట్టడం మంచిది కాదని, ఇది జాతి ఐక్యతకు అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.

"లఖింపుర్ ఖేరి ఘటనను ఊచకోతకు గురైన పేద రైతులకు-అహంకారం కలిగిన శక్తిమంతమైన వ్యక్తులకు మధ్య జరుగుతున్న న్యాయపోరాటంగానే చూడాలి. దీనిలో మతపరమైన కోణమేమీ లేదు."

-వరుణ్ గాంధీ, భాజపా నేత, పీలీభిత్ ఎంపీ

లఖింపుర్​ ఘటనపై విమర్శల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన భాజపా జాతీయ కార్యనిర్వాహకవర్గంలో వరుణ్ గాంధీ, మేనకా గాంధీకి(Maneka Gandhi) చోటు దక్కలేదు. ఆ కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.