ETV Bharat / bharat

'జిన్నా మార్గంలో రాహుల్ గాంధీ అడుగులు'​ - Congress

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. జిన్నా మార్గంలో నడుస్తున్నారని ఆరోపించారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. అది దేశాన్ని నాశనం చేస్తుందన్నారు. జీ-23 నేతలను ప్రచారానికి దూరం పెట్టటంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Cong following in Jinnah's footsteps
'జిన్నా మార్గంలో రాహుల్ గాంధీ'​
author img

By

Published : Mar 16, 2021, 5:30 AM IST

కాంగ్రెస్​ పార్టీ, రాహుల్​ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. మహాత్మా గాంధీ ఆలోచనలకు బదులు.. దేశాన్ని విభజించిన జిన్నా మార్గంలో రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నడుస్తోందని ఆరోపించారు. అది దేశాన్ని నాశనం చేస్తుందన్నారు.

అసోంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఈ మేరకు కాంగ్రెస్​పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు చౌహాన్​.

"స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేయటంలో కాంగ్రెస్​ విఫలమైంది. మాజీ ప్రధాని, అసోం రాజ్యసభ సభ్యుడు మన్మోహన్​ సింగ్​ సైతం రాష్ట్రం కోసం ఏమీ చేయలేదు. మహాత్మాగాంధీ మార్గాన్ని కాంగ్రెస్​ అనుసరించటం లేదు. కాంగ్రెస్​, రాహుల్​ గాంధీలు.. జిన్నా అడుగుజాడల్లో నడుస్తున్నారు. అది అసోంతో పాటు దేశాన్ని నాశనం చేస్తుంది. "

- శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి

ఆల్​ ఇండియా యునైటెడ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​తో చేతులు కలపటం పట్ల కాంగ్రెస్​ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు చౌహాన్​. అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయి వారితో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. అసోంను చొరబాటుదారులతో నింపిన బద్రుద్దీన్​ అజ్మల్​తో కాంగ్రెస్​ దోస్తి కట్టిందని ఆరోపించారు. 'వారికి గులాం నబీ ఆజాద్​, ఆనంద్​ శర్మలు అవసరం లేదు కానీ, అజ్మల్​ కావాలి' అని.. జీ-23 నేతలను ప్రచారానికి దూరం పెట్టటంపై పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్​ విభజించు పాలించు సూత్రాన్ని పాటిస్తోందన్నారు.

ఇదీ చూడండి: 'రాముడితో సమానంగా మోదీని చూస్తారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.