తారతమ్యం లేని భారతావనిని చూడాలని డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ కలలు కన్నారని.. ఆ దిశగా దేశాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అంబేడ్కర్ 130వ జయంతి పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించారు సోనియా.
"సంప్రదాయవాదం, వివక్ష మొదలైనవి సమాజాన్ని బలహీనపరిచే అంశాలు. కానీ, అన్ని వర్గాల వారు సమానమే అని కాంగ్రెస్ ఎల్లప్పుడూ గర్తుపెట్టుకుంటుంది. వివిక్ష చూపడం సరికాదని భావిస్తుంది. అందరం కలిస్తేనే భారత్‌ను ధృడంగా తీర్చిదిద్దగలం. భారత్‌ను ఈ విధంగానే చూడాలని అంబేడ్కర్ కలలు కన్నారు."
--సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.
నేటి ప్రజాస్వామ్య దేశంలో సమాజంలోని ఏ పౌరుడైనా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని సోనియా గాంధీ అన్నారు. స్వాతంత్య్రం అనంతరం భారత్ సాధించిన ఘనత ఇది అని అభివర్ణించారు.
ఇదీ చదవండి:జమ్ముకశ్మీర్‌లో రూ.50కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత