నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షం కురిసే సూచనలు పెరిగాయని, దక్షిణ అరేబియా సముద్రంలో పశ్చిమ గాలులు బలపడ్డాయని పేర్కొంది. కేరళ తీరం, సమీప సముద్ర ప్రాంతంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
"ప్రస్తుత పరిస్థితులు కేరళలో వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి."
-వాతావరణ శాఖ
రాష్ట్రంలో నైరుతి పవనాలు జూన్ 1నే వస్తాయని వాతావరణ శాఖ ఇదివరకు అంచనా వేసింది. కానీ ఆ తర్వాత అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ప్రకటించింది. ఇప్పుడు మూడు రోజులు ఆలస్యంగా వస్తున్నాయని తెలిపింది.
ఇదీ చదవండి : సీఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ క్లాసులు షురూ