అమెరికా వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌లో జరిగిన హింసాకాండలో పాల్గొన్న భారత సంతతి వ్యక్తిపై దిల్లీలోని కాలకాజీ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. భారత జాతీయ జెండాని పట్టుకుని హింసాత్మక ఘటనలో పాల్గొనడమే ఇందుకు కారణమని పోలీసులు వివరించారు. ఆందోళనల్లో పాల్గొనే వ్యక్తి త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లడం అనేది జాతీయతకు సంబంధించిన విషయమని తెలిపారు.
అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కనిపించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని వయసు సుమారు 54ఏళ్లుగా ఉండొచ్చని తెలిపారు.