ETV Bharat / bharat

ఆ 'సామాన్యులే'.. కష్టకాలంలో కొవిడ్​ బాధితులకు అండ!

కరోనా రెండోదశ మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆసుపత్రుల్లో సరైన వసతుల లేమితో రోగుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ తరుణంలో ఎందరో సామాన్యులు తమ సహృదయాన్ని చాటుకుంటున్నారు. తన అంబులెన్స్​ను కరోనా సేవలకు ఉచితంగా వినియోగించే వ్యక్తి ఒకరైతే.. చికిత్స పొందుతున్న రోగుల బంధువులకు వీడియో కాల్ చేయించేవారు మరొకరు. నీటిలో తేలియాడే బోట్​నే అంబులెన్స్​గా మార్చిన సేవ చేస్తున్న వ్యక్తి, జీవితమంతా సంపాదించిన సొమ్ముతో వెంటిలేటర్​ కొనుగోలు చేసిన వృద్ధుడు... ఇలా సామాన్యులైనప్పటికీ.. పలు రకాలుగా సేవచేసేందుకు ముందుకొస్తున్న వీరందరూ ఆదర్శనీయం.

common people free service to corona patients
సామాన్యులే అయితేనేం... అసామాన్య సేవల్లో బిజీబిజీ!
author img

By

Published : May 9, 2021, 8:02 PM IST

Updated : May 9, 2021, 8:28 PM IST

ఏడాది కాలంగా కరోనాతో యుద్ధం చేస్తున్నాడు మనిషి. ఈ చావుబతుకల పోరాటంలో కొందరు సాటివారికి అండగా ఉంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నాచితక పని చేసుకునే వ్యక్తులైనప్పటికీ.. ఎవరికి తోచిన మేరకు వారు సాయం అందిస్తున్న అలాంటి వ్యక్తులపై ప్రత్యేక కథనం ఇది.

కర్ణాటక హుబ్బళ్లికి చెందిన ఇర్షాద్ బల్లాషేత్ అనే వ్యక్తి కరోనా రోగులకు ఉచిత అంబులెన్స్ సేవలందిస్తూ సేవ చేస్తున్నారు. వ్యాధి బారిన పడిన వారికి సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం తనను కలచివేసిందని చెబుతున్నారు.

common people free service to corona patients
ఇర్షాద్ బల్లాషేత్ ఉచిత అంబులెన్స్ సేవలు

అంబులెన్స్​ శుభ్రం చేస్తున్న ఇర్షాద్ బల్లాషేత్

హుబ్బళ్లిలోని గణేశపేటలో నివసించే ఇర్షాద్ బల్లాషేత్.. స్వయంగా అంబులెన్స్‌ నడుపుతూ కరోనా రోగులను ఆసుపత్రికి తీసుకెళ్తారు. కొవిడ్​తో చనిపోయిన వారి మృతదేహాలను అంత్యక్రియలకు తీసుకువెళుతుంటారు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న ఇర్షాద్​ను స్థానికులు అభినందిస్తున్నారు.

వీడియోకాలూ ఒక సేవే..

గుజరాత్​లో ఎన్నడూ లేనంతగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నవ్​సారి జిల్లా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. ఇక్కడికి వచ్చేవారిలో చాలామంది నిరుపేదలే. స్మార్ట్​ఫోన్​ సదుపాయం లేని వీరు.. ఆసుపత్రిలో చేరిన తమవారి బాగోగులు తెలుసుకునేందుకు హెల్ప్​లైన్​ నంబరుకు ఫోన్​ చేయాల్సిందే.

వీడియోకాల్​ మాట్లాడిస్తున్న వలంటీర్​

కొవిడ్ రోగికి వీడియో కాల్ చేయిస్తున్న వలంటీర్

ఇక తమ కుటుంబ సభ్యులతో మాట్లాడలేని రోగులు సైతం మానసికంగా నిరాశకు గురవుతుంటారు. ఈ సమస్యను గమనించిన కొందరు యువ వలంటీర్లు కొవిడ్ రోగులతో వారి కుటుంబ సభ్యులకు వీడియో కాల్​ చేయిస్తూ.. సేవకు కాదేదీ అనర్హం అని చాటుతున్నారు. పీపీఈ కిట్లు ధరించి కొవిడ్ రోగులను సందర్శిస్తూ గ్రామాల్లో ఉన్న తమవారికి వీడియో కాల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు.

నీటిపై తేలియాడే అంబులెన్స్..

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో​ పడవ నడుపుకుని జీవనం సాగించే తారిక్​ అహ్మద్ పత్లూ అనే వ్యక్తి తన బోట్​నే అంబులెన్స్​గా మార్చేశారు. గతేడాది తాను మహమ్మారి బారిన పడిన సమయంలో సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని.. తన పరిస్థితి మరొకరికి రాకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు చెబుతున్నారు.

పత్లూ రూపొందించిన బోట్ అంబులెన్స్

దీనిలో ఒక బెడ్​తో పాటు.. స్ట్రెచర్, ప్రథమ చికిత్స కిట్ అమర్చినట్లు చెప్పారు తారిక్. కొద్దిరోజుల్లో ఆక్సిజన్ సిలిండర్​నూ ఏర్పాటు చేస్తానని తెలిపారు.

70ఏళ్ల వృద్ధుడి ఔదార్యం..

తాను పొదుపు చేసుకున్న రూ.2.5 లక్షలను కొవిడ్ చికిత్సలో కీలకమైన వెంటిలేటర్​ కొనుగోలు చేసేందుకు వెచ్చించారు 70 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు తన వంతుగా ఇలా సహాయం చేసినట్లు తెలిపారు ఛత్తీస్‌గఢ్ బెమెతరా జిల్లాలోని బెర్లాకు చెందిన పుస్రం సిన్హా అనే వ్యక్తి.

ఆసుపత్రిలో తాను అందించిన వెంటిలేటర్​తో పుస్రం సిన్హా

"నేను నా జీవితాన్ని ఆనందంగా గడిపాను. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడటం చాలా ముఖ్యం. నా ఈ ప్రయత్నం కనీసం కొందరి ప్రాణాలనయినా కాపాడగలదని నమ్ముతున్నా. అందుకే బెర్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి ఈ వెంటిలేటర్​ ఇచ్చా" అని సిన్హా తెలిపారు.

ఇవీ చదవండి: ప్రాణాలు కాపాడే 'బ్రీత్​ బ్యాంక్'​.. ఎక్కడంటే!

కొవిడ్​ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్​

Last Updated : May 9, 2021, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.