కర్ణాటకలోని బెంగళూరులో ఓ కాలేజీ విద్యార్థిని కిడ్నాప్ చేసి నిప్పంటించారు దుండగులు. చేతులు, కాళ్లు కట్టేసినా.. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ నివాసి అయిన శశాంక్ అనే విద్యార్థి.. స్థానికంగా ఓ కళాశాలలో చదువుతున్నాడు. మైసూర్లో ఉంటున్న దూరపు బంధువైన ఓ అమ్మాయిని అతడు గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వారి ప్రేమను ఇరువురి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయితే జులైన 3వ తేదీన బెంగళూరుకు వచ్చిన ఆ అమ్మాయిని శశాంక్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. శశాంక్ ఇంటికి జులై 10న వెళ్లారు. శశాంక్‌పై దాడి చేసి అమ్మాయిను తమ వెంట తీసుకెళ్లిపోయారు.
అయితే శనివారం ఉదయం శశాంక్‌ను అతడి తండ్రి రంగనాథ్.. తన బైక్‌పై కళాశాల వద్ద దింపాడు. అదే రోజు సాయంత్రం కాలేజీ అయ్యాక.. బస్సు కోసం బాధితుడు రోడ్డు మీద ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా వచ్చిన కొందరు వ్యక్తులు.. శశాంక్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం కాళ్లు, చేతులు కట్టేశారు. యాసిడ్ లాంటి మండే పదార్థాలను అతడిపై పోసి సజీవదహనం చేసేందుకు యత్నించారు.
అప్రమత్తమైన శశాంక్.. ఎలాగోలా మంటలను ఆర్పివేశాడు. స్థానికుల సహాయంతో ఇంటికి చేరుకున్నాడు. శరీరమంతా తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న శశాంక్‌ను అతడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై శశాంక్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మార్నింగ్ వాక్కు వెళ్లి.. మృత్యుఒడిలోకి..
లారీకి ఉండే తాడు.. కాలులో చిక్కుకుని మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు మీదే మరణించాడు. దీంతో అతడి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కేరళలోని కొట్టాయం జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం..
జిల్లాలోని సంక్రాంతి ప్రాంతానికి చెందిన మురళి (50) అనే వ్యక్తి.. ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లాడు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఓ కూరగాయల లారీ నుంచి తాడు.. కిందపడి మురళి కాలుకు చుట్టుకుంది. దీంతో లారీ అతడిని 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిపోయింది. గమనించిన స్థానికులు.. ఆ లారీని ఆపివేశారు.
హుటాహుటిన బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయినా లాభం లేకుండాపోయింది. మురళి.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. బాధితుడిని లారీని ఈడ్చుకెళ్లడం వల్ల మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానికులు.. కొట్టాయం ఆస్పత్రికి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్, హెల్పర్‌ను స్థానికులు.. పోలీసులకు అప్పగించారు.
అయితే ప్రమాదం గురించి తమకు తెలియదని, స్థానికులు చెప్తేనే తెలిసిందని పోలీసులకు డ్రైవర్,హెల్పర్ చెప్పారు. లారీ కదులుతున్న సమయంలో తాడు వేలాడుతున్న విషయాన్ని గమనించలేదని తెలిపారు. అయితే ఈ ఘటనపై సీసీటీవీ విజువల్స్‌ను పరిశీలిస్తామని.. ఆపై సమగ్ర విచారణ చేపడతామని పోలీసులు వెల్లడించారు.
బీచ్‌లో చిన్నారులు గల్లంతు..
మహారాష్ట్ర.. ముంబయిలోని మలాడ్ మార్వ్ బీచ్‌కు వెళ్లిన ఐదుగురు చిన్నారులు.. నీట మునిగారు. సమాచారం అందుకున్న అధికారులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. రెస్క్కూ ఆపరేషన్ చేపట్టి ఇద్దరిని రక్షించారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
-
#WATCH | Search & rescue underway at Marve Creek, Malad after five boys of age group 12 to 16 years drowned today morning; three boys remain missing, two rescued
— ANI (@ANI) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Teams of BMC, Police, Coast Guard and Navy divers are present at the spot pic.twitter.com/2HwUXWTOHo
">#WATCH | Search & rescue underway at Marve Creek, Malad after five boys of age group 12 to 16 years drowned today morning; three boys remain missing, two rescued
— ANI (@ANI) July 16, 2023
Teams of BMC, Police, Coast Guard and Navy divers are present at the spot pic.twitter.com/2HwUXWTOHo#WATCH | Search & rescue underway at Marve Creek, Malad after five boys of age group 12 to 16 years drowned today morning; three boys remain missing, two rescued
— ANI (@ANI) July 16, 2023
Teams of BMC, Police, Coast Guard and Navy divers are present at the spot pic.twitter.com/2HwUXWTOHo
మంబయిలోని మల్వాని ప్రాంతానికి చెందిన ఐదుగురు బాలురు.. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బీచ్‌కు వెళ్లారు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. ఆ తర్వాత మునిగిపోయారు. కృష్ణ జితేంద్ర హరిజన్ (16), అంకుశ్ భరత్ శివరే (13)ను అక్కడి సిబ్బంది రక్షించారు. శుభమ్ రాజ్‌కుమార్ జయస్వాల్(12), నిఖిల్ సాజిద్ కయంకూర్(13), అజయ్ జితేంద్ర హరిజన్(13) కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.