కేరళ కాసర్గోడ్ జిల్లాలోని అరమంగనమ్ గ్రామంలో ఓ కొబ్బరి చెట్టు.. కాయలకు బదులు మొక్కలను ఇస్తోంది. మహమ్మద్ కుంజు అనే రైతు తన ఇంటి సమీపంలో ఆరేళ్ల క్రితం కొబ్బరి మొక్కలు నాటారు. అందులో ఓ చెట్టుకు కాయలు కాకుండా మొక్కలు పెరిగాయి. దాదాపు 12 మొక్కలు ఒకే చెట్టు మీద పెరిగాయి. కొన్ని మొక్కలకు దాదాపు 2 ఏళ్ల వయసుంటుంది.
"రెండేళ్ల క్రితమే కొబ్బరి చెట్టుపై మొలకలు వచ్చాయి. తొలుత ఒకే మొక్క పెరిగింది. ఆ తర్వాత చెట్టుకు అన్నీ కొబ్బరి మొలకలే వచ్చాయి. మొదట కలవరపడ్డాను."
-మహమ్మద్ కుంజు, రైతు
మహమ్మద్ కుంజు ఇంటి ఆవరణలోని ఈ కొబ్బరి చెట్టు ఎత్తు 10 ఫీట్లకు పైగా ఉంటుంది. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'అలవట్టం' రూపొందిస్తూ 50 ఏళ్లుగా దైవసేవలో..
ఇదీ చదవండి: నదిలో చిక్కుకున్న ట్రాక్టర్- జవాన్ల సాయంతో ఒడ్డుకు