దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో రోగులకు వడ్డించే భోజనంలో బొద్దింకలు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆ రోగి బంధువులు ఆందోళనకు దిగారు. ఓ ట్విట్టర్ యూజర్ దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనతో ఎయిమ్స్‌లో రోగులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది: దిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ వైద్యశాలలో శస్త్రచికిత్స నిమిత్తం ఓ చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్‌కు ముందు ఎలాంటి ఆహారం తినిపించకూడదని చెప్పారు వైద్యులు. దీంతో గత రెండు రోజులు నుంచి చిన్నారికి ఏమీ తినిపించలేదు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన ఎనిమిది రోజులకు కూడా చిన్నారికి ఆహారం తినిపించలేదు.
ఎనిమిది రోజుల అనంతరం రోగికి పప్పు అన్నం అందించారు వైద్యులు. తీరా బిడ్డకు తినిపిద్దామని కలుపుతుంటే అందులో బొద్దింక కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్పత్రిలో ఇలాంటి ఆహారాన్ని వడ్డిస్తున్నారని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఫిర్యాదును స్వీకరించిన సిబ్బంది విషయాన్ని సమగ్రంగా విచారణ చేపడుతామని తెలిపారు.
ఇదీ చదవండి: క్రైమ్ సిరీస్ స్ఫూర్తితో ప్రేయసి హత్య.. శవాన్ని 35 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో ఉన్న ముఖాన్ని రోజూ చూస్తూ..