ETV Bharat / bharat

ఏపీలో జోరుగా కోడి పందేలు - కోట్ల రూపాయల బెట్టింగులతో సై అంటున్న ఆటగాళ్లు - Cock Fights

Cock Fights in Andhra: ఏపీలో కోడి పందేలు, గుండాటలు, జూదం వంటి క్రీడలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి వేళ జరుగుతున్న ఈ ఆటాలపై హైకోర్టు అంక్షలున్నా, నిర్వాహకులు వాటిని పట్టించుకోకుండా పందేం బరులను ఏర్పాటు చేశారు. వైఎస్సార్​సీపీ నేతల అండదండలతో ప్రత్యేక శిబిరాలను సిద్దం చేసి, కోట్ల రూపాయల పందేలను నడిపిస్తున్నారు.

cock_fights_in_andhra
cock_fights_in_andhra
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 10:20 AM IST

Cock Fights in Andhra: సంక్రాంతి వేళ ఆంధ్రప్రదేశ్​లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. భారీగా బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు, గుండాట, జూదం వంటి క్రీడలను నిర్వహిస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పందేలు కాస్తున్నారు. బరుల ఏర్పాట్లలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండటంతో పోలీసులు అటువైపు కన్నెత్తయినా చూడటం లేదు.

హైకోర్టు ఆంక్షలున్నా పట్టించుకోకుండా కోస్తా జిల్లాల్లో పెద్దఎత్తున కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో జాతీయ రహదారి పక్కనే పందేల నిర్వహణ జాతరను తలపించింది. బరి చూట్టూ సీఎం జగన్‌ చిత్రాలతో బ్యానర్లు, వైఎస్సార్​సీపీ జెండాలతో నింపేశారు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనుసన్నల్లో, ఆయన అనుచరుడి ఆధ్వర్యంలోనే ఈ బరిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌తోనూ ఈ వైఎస్సార్​సీపీ నాయకుడికి సంబంధాలు ఉన్నాయని, నెల రోజుల కిందట కలిసి వచ్చారని సమాచారం. పోలీసులు మాత్రం అంపాపురం వైపు చూడటానికి సాహసించడం లేదు.

కోడి పందేల జోరు.. ప్రజాప్రతినిధుల హుషారు.. కానరాని ఖాకీలు

అంపాపురం బరిలో తొలిరోజే కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయల మేరకు పందేలు నడిచినట్లు అంచనా వేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం ఏసీ శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ల దగ్గరకే మద్యం, ఆహారం వంటివి అందిస్తున్నారు. వీఐపీల బరిలో తొలి పోటికే నిర్వాహకులు 5 లక్షలు పెట్టగా, పందెంరాయుళ్లు 15 లక్షల వరకు కాశారు. అక్కడి నుంచి ప్రతి పోటికీ కనీసం 20 లక్షల వరకు పందేలు జరిగాయి.

అంపాపురం బరిలోనే తొలిరోజు 20కి పైగా పోటీలు జరగ్గా, సుమారు 4 కోట్ల వరకు పందేలు కాసినట్లు తెలుస్తోంది. ప్రధాన బరులతో పాటు 15 నుంచి 20 చిన్న కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. వాటిలోనూ లక్షల రూపాయల్లో పందేలు సాగాయి. ఈ బరిలో రాత్రి సమయంలో ప్రత్యేకంగా బుల్లెట్‌ కోడి పందేల కోసం ఏర్పాటు చేశారు.

రెండు గ్రూపుల మధ్య ఏడుసార్లు కోడి పందేలు పెట్టి, నాలుగుసార్లు గెలిచిన వాళ్లకి బహుమతి ఇస్తారు. అయితే ఇది గతేడాది వివాదంగా మారడంతో ఈ సారి బుల్లెట్‌ విధానాన్ని ప్రదర్శనలో ఉంచలేదు. పొట్టేళ్ల పందేల కోసం కూడా రెండు శిబిరాలు ఏర్పాటు చేశారు. దాదాపు వంద పొట్టేళ్లను ముందే సిద్ధం చేశారు.

అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో.. యథేచ్ఛగా కోడి పందేలు

మరోవైపు బరిలో ఏర్పాటు చేసిన వీఐపీ కోత ముక్క శిబిరంలోకి అడుగుపెట్టాలంటే 12 వేల రూపాయలు కట్టాలి. చేతికి ఒక ట్యాగ్‌ కట్టి లోనికి పంపిస్తారు. 2 వేలు రుసుము కింద తీసుకుని మిగతా 10వేలకు టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్లతో లోపలికి వెళ్లి ఆడాలి. బరిలో ఏర్పాటు చేసిన శిబిరాలన్నింటినీ అమ్మేసుకుని వంశీ అనుచరుడు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.

ఈ మూడు రోజులకు కలిపి ఒక్కో చిన్న కోతముక్క శిబిరాన్ని 4 లక్షలకు ఇచ్చేశారు. పెద్ద కోతముక్క శిబిరాన్ని కొంతమందితో కలిసి ఆయనే సిండికేట్‌గా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పెద్ద శిబిరాల్లో కోట్లలోనే పందేలు జరుగుతుంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన మద్యం, బిర్యానీ, భోజనం సహా ఆహార పదార్థాల స్టాళ్లు, పండ్లరసాలు, కొబ్బరిబొండాలు, సిగిరెట్లు, గుట్కాలమ్మే దుకాణాలన్నింటినీ లీజుకు ఇచ్చేశారు.

కత్తులు దూసిన పందెం కోళ్లు.. చేతులు మారిన కోట్లు.. లెక్కకురాని ఆంక్షలు

ఒక్కో దుకాణానికి మూడు రోజులకు లక్షన్నర వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి దుకాణాలు 50కి పైగా ఉన్నాయి. జాతీయ రహదారి పక్కనున్న సర్వీసు రోడ్లు వాహనాలతో కిక్కిరిసినా పోలీసులు కనీసం స్పందించలేదు.

ఎన్టీఆర్​ జిల్లాలోని నందిగామలోనూ వైఎస్సార్​సీపీ నేతల అండదండలతో పందేపు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్​సీపీ ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పోటీలు నిర్వహిస్తుండటంతో పోలీసులు పట్టించుకోవట్లేదు. నందిగామలోని పందేలను ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ ప్రారంభించారు.

ఎల్‌ఈడీ తెరలు.. డిజిటల్ లావాదేవీలు.. గోదావరి జిల్లాలో ఈ సారి టెక్ కోడి పందాలు

ఐతవరంలో ఎమ్మెల్యే జగన్మోహన్‌రావుతో కలిసి ఎమ్మెల్సీ ప్రారభించారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గమళ్లపాలెంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా వైఎస్సార్​సీపీ నేతలు గ్రామ శివార్లలో పందేలు నిర్వహించారు. ఈ పందేల్లో లక్షల రూపాయల్లో బెట్టింగులు సాగుతున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిస్తున్నా పోలీసులు చూస్తు ఊరుకుంటున్నారు తప్ప ఆపేందుకు యత్నించడం లేదు.

కోడి పందేలు, గుండాటలకు ఉభయ గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున కోడి పందేలు, గుండాటలు, జూదం నిర్వహిస్తున్నారు. తణుకు, తేతలి, దువ్వ, వేల్పూరులో ఫ్లడ్‌లైట్లు వేసి రాత్రి సమయంలోనూ పందేలు కొనసాగిస్తున్నారు.

కోడి పందేల నిర్వహణకు అధికార నేతల 'బరి' తెగింపు ఏర్పాట్లు

ఏపీలో జోరుగా కోడి పందేలు - కోట్ల రూపాయల బెట్టింగులతో సై అంటున్న ఆటగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.