తమిళనాడు మదురై అరప్పాళయంలో ఓ ఏడేళ్ల బాలుడి మంచి మనసుకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫిదా అయ్యారు. రెండో తరగతి చదువుతున్న హరీష్ వర్మ(7).. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా తన రెండేళ్ల కలను త్యాగం చేశాడు. సైకిల్ కొనేందుకు 2 సంవత్సరాలుగా దాచుకున్న రూ. 1000ను.. సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చాడు.
నెరవేరిన కల..
చిన్నారి సేవాగుణానికి కరిగిపోయిన సీఎం స్టాలిన్.. బాలుడి రెండేళ్ల కలను తీర్చారు. హరీష్‌కు శుభాకాంక్షలు చెబుతూ.. సైకిల్ బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత బాలుడికి ఫోన్‌చేసి ప్రశంసించారు. ఉత్తర మదురై డీఎంకే పార్టీ సెక్రటరీ కే. తళపతి.. సైకిల్‌ను బాలుడికి అందజేశారు.
ఇదీ చదవండి : కొవిడ్ కేర్ సెంటర్‌గా గోశాల