ETV Bharat / bharat

Telangana Government Decision to regularize JPS : జేపీఎస్‌ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం

Telangana Government
Telangana Government
author img

By

Published : May 22, 2023, 7:15 PM IST

Updated : May 22, 2023, 8:46 PM IST

19:11 May 22

క్రమబద్ధీకరణ విధివిధానాల ఖరారుకు సీఎం ఆదేశం

Telangana Government Decision to regularize JPS : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. ఈమేరకు సచివాలయంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో జేపీఎస్‌ల క్రమబద్దీకరణ అంశంపై కేసీఆర్ చర్చించారు.

కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానికసంస్థల అదనపు కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర స్థాయి నుంచి కార్యదర్శి లేదా శాఖాధిపతి స్థాయి అధికారి జిల్లా కమిటీకి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేస్తారు.

జేపీఎస్‌ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను.. రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీటిని నివేదిస్తారు. అనంతరం క్రమబద్ధీకరణ విషయమై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. అటు రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించారు. ఆ స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్‌ల భర్తీ ప్రక్రియ, క్రమబద్ధీకరణ తదుపరి దశలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అసలేం జరిగిదంటే: ఇటీవల క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏప్రిల్‌ 28 నుంచి 16 రోజులుగా జేపీఎస్‌లు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈక్రమంలోనే ప్రభుత్వం సమ్మెలో పాల్గొన్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మె విరమించాలని.. లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.

ఎవరైనా విధుల్లో చేరకుంటే వారి స్థానంలో కొత్తగా తాత్కాలిక జూనియర్ పంచాయతీ సెక్రటరీలను నియమించాలని అధికారులకు సూచించింది. దీనిని ఏ మాతం లెక్క చేయని జేపీఎస్​లు సమ్మెను కొనసాగించారు. ఈక్రమంలోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారితో చర్చలు జరిపారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో జేపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరారు.

ఇవీ చదవండి: Panchayat Secretaries Joined Their Duties : రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరిన జేపీఎస్​లు

KCR Review on Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

మణిపుర్​లో మళ్లీ హింస.. పలు ఇళ్లకు నిప్పు.. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

Last Updated : May 22, 2023, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.