ETV Bharat / bharat

CM KCR Contests from Two Seats : ఈసారి గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ - BRS MLA Candidates List 2023

CM KCR Contests from Kamareddy and Gajwel
CM KCR Contests from Two Seats
author img

By

Published : Aug 21, 2023, 2:56 PM IST

Updated : Aug 21, 2023, 8:46 PM IST

14:51 August 21

CM KCR Contests from Kamareddy : కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ

CM KCR Contests from Two Seats ఈసారి గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ

CM KCR Contests also Kamareddy : అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను.. భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr announced first list brs candidates) విడుదల చేశారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని చెప్పారు. కానీ 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు మార్చినట్లు వివరించారు. కోరుట్ల, ఉప్పల్‌, వేములవాడ, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, వైరాలో సిట్టింగ్‌ అభ్యర్థులను మారుస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

BRS MLA Candidates List Telangana 2023 : ఈ నేపథ్యంలోనే నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను నిలిపివేశామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇందులో నర్సాపూర్‌, నాంపల్లి , జనగామ, గోషామహల్‌ స్థానాలు ఉన్నాయి. ఈసారి కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ స్థానం గజ్వేల్​తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా తాను పోటీ చేయనున్నట్లు తెలియజేశారు. 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 17 స్థానాల్లో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

పాత రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని 29 స్థానాల్లో బీఆర్ఎస్, మజ్లిస్‌ గెలుస్తాయని కేసీఆర్ వెల్లడించారు. ఎన్నికలను పార్టీ పవిత్ర యజ్ఞంలా భావిస్తుందని.. ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఉజ్వలమైన తెలంగాణ భవిష్యత్‌కు ప్రజలు భారత్ రాష్ట్ర సమితిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్‌ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కోరినందునే తాను కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నాని.. మరే ఇతర కారణం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే అక్టోబరు 16న వరంగల్‌లో సింహగర్జన సభను ఏర్పాటు చేయనున్నట్లు.. ఈ సభలోనే సభలో పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తామని వ్యాఖ్యానించారు. మైనంపల్లికి టికెట్‌ ఇచ్చామని పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టం పునురుద్ఘాటించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలా, వద్దా అన్నది మైనంపల్లి నిర్ణయించుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ సందడి చేశారు.

"95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది.9ఏళ్లలో మేనిఫెస్టోలో చెప్పని అనేక పథకాల్ని అమలుచేశాం. పాత రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని 29 స్థానాలు బీఆర్ఎస్, మజ్లిస్‌ గెలుస్తాయి. అక్టోబరు 16న వరంగల్‌లో సింహగర్జన సభ నిర్వహిస్తాం. వరంగల్‌ సింహగర్జన సభలో బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తాం. మైనంపల్లికి టికెట్‌ ఇచ్చాం.. పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టం. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలా, వద్దా అన్నది మైనంపల్లి నిర్ణయించుకోవాలి." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి

టికెట్లు కోల్పోయిన వారి జాబితా..

టికెట్‌ కోల్పోయిన వారి పేరునియోజకవర్గం
సుభాష్‌ రెడ్డిఉప్పల్‌
రాములు నాయక్‌వైరా
రేఖా నాయక్‌ఖానాపూర్‌
చెన్నమనేని రమేశ్వేములవాడ
గంప గోవర్ధన్ కామారెడ్డి
రాఠోడ్ బాపురావుబోథ్‌
ఆత్రం సక్కుఆసిఫాబాద్‌

అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల జాబితా..

నియోజకవర్గం పేరు
నర్సాపూర్‌
నాంపల్లి
జనగామ
గోషామహల్‌

MLA Mynampally on Harish Rao : 'హరీశ్‌ రావు అడ్రస్‌ గల్లంతు చేస్తా.. సిద్దిపేట బరిలో దిగుతా'

BRS MLA Tickets 2023 : సీట్ల కోసం BRS నేతల ఫైట్లు.. కేసీఆర్ సాబ్ ఎవరికి 'ఊ అంటారు.. ఎవర్ని ఊఊ' అంటారో..?

Last Updated : Aug 21, 2023, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.