పంజాబ్‌ను కరోనా రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం అమరీందర్ సింగ్. 100 శాతం వ్యాక్సినేషన్ సాధించిన గ్రామాలకు రూ.10లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి గ్రాంటును మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది.
ఇప్పటివరకు దేశంలో 18.44కోట్ల మందికి టీకా వేయగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకా పంపిణీ కార్యక్రమం మందగించిందని పలు రాష్ట్రాలు ఫిర్యాదులు చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం పంజాబ్ లో మే18 నాటికి 5,04,586 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 12,086 మంది చనిపోయారు.
![Rs. 25,000 reward for corona free village: DC Rohini Sindhuri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-04-dc-rohini-sinduri-vis-ka10003_18052021140704_1805f_1621327024_990_1805newsroom_1621332958_314.jpg)
మైసూర్ లోనూ..
కర్ణాటకలోని మైసూర్లోనూ కరోనా రహిత గ్రామానికి రూ.25 వేల రివార్డును ప్రకటించారు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి. కొవిడ్ రోగుల కారణంగా ఆస్పత్రులపై ఒత్తిడి పడకుండా జిల్లాలోని 150 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 'కొవిడ్ మిత్ర'గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఈ సూచన చేసినట్లు వెల్లడించారు. నైపుణ్యం గల వైద్యులతో టెలీమెడిసిన్ సేవలనూ అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కొవిడ్‌ను జయించేందుకు ఈ ఆహారమే బెస్ట్!