ETV Bharat / bharat

శివసేన ర్యాలీలో ఉద్రిక్తత.. రెండు వర్గాల రాళ్ల దాడులు

Punjab Patiala clash: పంజాబ్ పటియాలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు పోలీసులు.

clash-between-shiv-sena-and-khalistan-supporters-in-patiala

author img

By

Published : Apr 29, 2022, 2:36 PM IST

Updated : Apr 29, 2022, 10:34 PM IST

Punjab Patiala clash: పంజాబ్‌లోని పటియాలాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు కర్ఫ్యూకు దారి తీసాయి. శుక్రవారం కాళీ మందిర్‌ ప్రాంతంలో శివసేన నేతలు ఖలిస్థాన్‌ వ్యతిరేక ర్యాలీ చేపట్టగా, మరో వర్గం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకోగా, పలువురు గాయపడ్డారు. గొడవలను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. పటియాలాకు అదనపు బలగాలు రప్పించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పంజాబ్‌ పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై కొందరు వదంతులను వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు.

clash-between-shiv-sena-and-khalistan-supporters-in-patiala
ర్యాలీ నిర్వహిస్తున్న శివసేన కార్యకర్తలు

ఈ ఘటనపై పంజాబ్​ సీఎం మాన్​ స్పందించారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పంజాబ్​లో శాంతి, సామరస్యం నెలకొల్పడమే తమ లక్ష్యమని అన్నారు సీఎం భగవంత్ మాన్.

ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

శివసేన ర్యాలీలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న రెండు వర్గాలు

ఇరు వర్గాలు విసురుకున్న రాళ్లు

ఇదీ చూడండి: క్యాబ్​ డ్రైవర్​ను హత్యచేసిన మైనర్లు.. 32సార్లు కత్తితో పొడిచి..

Last Updated : Apr 29, 2022, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.