ETV Bharat / bharat

''అన్న తిరిగొచ్చాడు..' నిందితుడికి స్వాగతం పలుకుతూ హోర్డింగులా?' - అత్యాచార నిందితులకు హెర్డుంగులపై జస్టిస్ ఎన్​.వి. రమణ ఆగ్రహం

CJI NV Ramana comments: అత్యాచార నిందితుడికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో అతడికి స్వాగతం పలుకుతూ హెర్డింగును పెట్టడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. "భయ్యా ఈజ్‌ బ్యాక్‌ అని హోర్డింగు పెట్టడమేంటి? అసలు దీని అర్థమేంటి? బెయిల్‌ మంజూరుచేస్తే ఏం వేడుక చేసుకున్నారు? ఈ వారం మీ భయ్యాను జాగ్రత్తగా ఉండమని చెప్పండి" అని హెచ్చరించింది.

cji n.v ramana comments
''అన్న తిరిగొచ్చాడు..' నిందితుడికి స్వాగతం పలుకుతూ హోర్డింగులా?'
author img

By

Published : Apr 12, 2022, 12:53 PM IST

CJI NV Ramana comments: బెయిల్‌ మంజూరైన అత్యాచార నిందితుడికి స్వాగతం పలుకుతూ.. 'భయ్యా ఈజ్‌ బ్యాక్‌' అంటూ హోర్డింగు పెట్టడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు.. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, మూడేళ్ల పాటు ఆమెపై లైంగిక చర్యలు జరుపుతూ వచ్చాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబరులో అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అతడికి ఘన స్వాగతం పలుకుతూ సదరు వ్యక్తి ఉండే ప్రాంతంలో హోర్డింగును ఏర్పాటు చేశారు.

ఈ పరిణామంతో నిందితుడికి మంజూరుచేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హోర్డింగు విషయాన్ని బాధితురాలి తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో డిఫెన్స్‌ న్యాయవాదిని ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా స్పందించింది. "భయ్యా ఈజ్‌ బ్యాక్‌ అని హోర్డింగు పెట్టడమేంటి? అసలు దీని అర్థమేంటి? బెయిల్‌ మంజూరుచేస్తే ఏం వేడుక చేసుకున్నారు? ఈ వారం మీ భయ్యాను జాగ్రత్తగా ఉండమని చెప్పండి" అని హెచ్చరిస్తూ, ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: 'అఫిడవిట్లు ముందుగా జర్నలిస్టులకా?'.. మీడియాపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.