ETV Bharat / bharat

'వారిని న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదు' - జస్టిస్​ ఎన్​వీ రమణ సుప్రీంకోర్టు

అధికార పార్టీ అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI Ramana Latest News) జస్టిస్​ ఎన్​వీ రమణ. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

justice nv ramana latest news
జస్టిస్​ ఎన్​వీ రమణ
author img

By

Published : Oct 1, 2021, 6:41 PM IST

అధికారులు, పోలీస్‌ వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ (CJI Ramana Latest News) ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార పార్టీ అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదని స్పష్టంచేశారు. వసూళ్లకు పాల్పడే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని.. అధికారులు కోర్టులను ఆశ్రయించడం అలవాటుగా మారిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఏడీజీ కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.

అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని (CJI Ramana Latest News) జస్టిస్​ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సీజేల నేతృత్వంలో స్థాయీ సంఘం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ప్రస్తుతానికి స్థాయీ సంఘంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని వెల్లడించారు.

ఇదీ చూడండి : కోర్టులపై రైతులు విశ్వాసం ఉంచాలి: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.