హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ప్లాంట్ భద్రతను ఇకపై సీఐఎస్ఎఫ్ పర్యవేక్షించనుంది. వచ్చే వారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం... ప్లాంట్‌ను తమ అధీనంలోకి తీసుకోనుంది. శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షించనున్నారు.
సీఐఎస్ఎఫ్ కమాండోలు భారత్ బయోటెక్ ప్లాంట్‌ను పహారా కాసే నిర్ణయానికి ఇటీవలే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.