బంగాల్లో కలకలం సృష్టించిన సీతల్కుచి కాల్పుల కేసు దర్యాప్తు బాధ్యతలను ఆ రాష్ట్ర సీఐడీ విభాగం స్వీకరించింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది.
రాష్ట్రంలో ఈ నెల 10న నాలుగో దశ ఎన్నికల సందర్భంగా సీతల్కుచి అసెంబ్లీ స్థానం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), స్థానికుల మధ్య ఘర్షణ తలెత్తింది. బలగాల కాల్పుల్లో నలుగురు మరణించారు.
మరోవైపు సీతల్కుచి కాల్పుల కేసు దర్యాప్తులో పురోగతిపై వచ్చే నెల 5న తమకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఐడీని కోల్కతా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో జ్యుడీషియల్ దర్యాప్తును కోరుతూ రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్లు) దాఖలైన నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చూడండి: 'ఓటర్ల ప్రలోభానికి రూ.1000 కోట్లు'