CID filed PT warrant against Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కోంటూ సీఐడీ పీటీ వారంట్ దాఖలు చేసింది. స్థానిక ఏసీబీ కోర్టులోనే ఈ పిటిషన్ ను సీఐడీ దాఖలు చేసింది. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని పేర్కోంటూ చంద్రబాబు పై అభియోగం మోపింది. 2021లో ఫైబర్ నెట్ కేసు నమోదు చేసిన సీఐడీ 19 మందిపై అభియోగాలు మోపింది. టెండర్లు లేకుండానే టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ పేర్కోంది. టెరాసాఫ్ట్ కు 121కోట్ల రూపాయల మేర అప్పటి చంద్రబాబు ప్రభుత్వం లబ్దికలిగించిందని పేర్కోంటూ సీఐడీ ఈ పీటీ వారంట్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
CID filed PT warrant against Chandrababu: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ - టెరాసాఫ్ట్ కేసు
![CID filed PT warrant against Chandrababu: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ CID filed PT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-09-2023/1200-675-19554311-117-19554311-1695128710471.jpg?imwidth=3840)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Sep 19, 2023, 6:18 PM IST
|Updated : Sep 19, 2023, 6:40 PM IST
18:13 September 19
ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ