ఓ చర్చి పాస్టర్ దేవుడు ఆజ్ఞాపించాడని చెప్పి బాలికకు తాళికట్టాడు. దాంతో షాక్కు గురైన ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్పుడు అక్కడే ఉన్న బాలిక తల్లి ఇదంతా చూసి కంగుతింది.
మే 14న కర్ణాటక బళ్లారిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై జూన్ 16న అందిన ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాస్టర్ జనప్ప పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆదర్శ కుమారులు- తండ్రికి గుడి కట్టి పూజలు