ETV Bharat / bharat

దూసుకెళ్లిన టమాటాల ట్రక్​.. ఇంటి బయట నిద్రిస్తున్న ఆరుగురు మృతి - రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

పికప్ ట్రక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే నిద్రిస్తున్న ఏడుగురి పైనుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

chitrakoot road accident
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jul 9, 2022, 12:04 PM IST

ఉత్తర్​ప్రదేశ్.. చిత్రకూట్​లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటొల లోడ్​తో వెళ్తున్న పికప్ ట్రక్.. అదుపు తప్పి రోడ్డు పక్కనే నిద్రిస్తున్న ఏడుగురు వ్యక్తులపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఒకరు గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారాన్ని ప్రకటించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: చిత్రకూట్ జిల్లా.. భరత్‌కూప్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న గ్రామస్థులపై టమాటొ లోడ్​తో వెళ్తున్న పికప్ ట్రక్కు అదుపు తప్పి వారిపై దూసుకెళ్లింది. బాధితుల ఇల్లు.. రహదారి పక్కనే ఉందని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు.

ఇవీ చదవండి:
కోడలి ముఖంపై వేడివేడి నూనె పోసిన అత్తామామ.. 6ఏళ్లైనా పిల్లలు పుట్టట్లేదని..
భద్రత వలయంలో ఉన్నా.. హత్యకు గురైన నేతలెందరో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.