ETV Bharat / bharat

Chirag Paswan: ఎల్​జేపీపై పట్టుకు నేతల ఎత్తులు - బిహార్ న్యూస్

నాన్న రామ్‌విలాస్‌ పాసవాన్‌ను, తనను, తన కుటుంబాన్ని ఎంతో ఆప్యాయంగా చూసుకునే చిన్నాన్నే ఎందుకని తిరుగుబాటు జెండా ఎగరేశారు? లోక్‌జన శక్తి పార్టీ (ఎల్​జేపీ)లో ఎందుకని ముసలం ఆరంభమైంది? అబ్బాయి చిరాగ్‌ పాసవాన్‌పై(Chirag Paswan) ఎందుకని బాబాయ్‌ పశుపతి కుమార్‌ పరస్‌కు చిరాకు కలిగింది?. ఇదేమీ ఉన్నట్టుండో.. పదవీ రాజకీయంలో భాగంగానో జరిగిందేమీ కాదు. దీని వెనకాలో పెద్ద కథే ఉందంటున్నారు పశుపతి కుమార్‌, ఆయన అనుచరులు!

chirag paswan, pasupathi kumar
చిరాగ్ పాసవాన్, పశుపతి
author img

By

Published : Jun 16, 2021, 8:50 AM IST

బిహార్‌ ఎన్నికలకు ముందు.. ఎల్​జేపీ అధినేత రామ్‌విలాస్‌ పాసవాన్‌ చనిపోగానే.. ఆయన కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌(Chirag Paswan) పార్టీ పగ్గాలు చేపట్టారు. పాసవాన్‌ బతికున్నన్ని రోజులు తన తమ్ముళ్లను, కుటుంబ సభ్యులందరినీ బాగా చూసుకునేవారు. వారి కుటుంబ అవసరాలు కూడా ఆయనే తీర్చేవారు. అన్నదమ్ములందరి మధ్య మంచి అనుబంధం ఉండేది. తమ్ముడు పశుపతి కూడా అన్న రామ్‌ విలాస్‌ పాసవాన్‌ వెంటే ఉండేవారు. ఆయన బిహార్‌కు వచ్చారంటే.. అంతా పశుపతే చూసుకునేవారు.

ఇదీ చదవండి:చిరాగ్ ఏకాకి- దెబ్బకుదెబ్బ తీసిన నితీశ్!

నమ్మిన బంటు..

ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. తొలిసారి ఎంపీగా ఎంపికైన 71 సంవత్సరాల పశుపతి.. రామ్‌విలాస్‌కు నమ్మిన బంటు! అలాంటి బాబాయిని.. పార్టీ పగ్గాలు చేపట్టగానే చిరాగ్‌ పక్కనబెట్టారు. అంతేగాకుండా ఓ రోజు.. "నువ్వు నా రక్తసంబంధం కానేకావు" అంటూ పెద్దగా అందరి ముందు అరిచి అవమాన పరిచారు చిరాగ్‌!(Chirag Paswan) ఆ సందర్భంలో రామ్‌విలాస్‌ పాసవాన్‌ భార్య కూడా అక్కడే ఉన్నారు. ఆ క్షణంలోనే కన్నీరు పెట్టుకుంటూ "నీకు నీ చిన్నాన్న చచ్చిపోయాడనుకో" అంటూ అవమానాన్ని దిగమింగుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు పశుపతి! అంతేగాకుండా బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ను మెచ్చుకుంటూ తానోసారి మాట్లాడితే.. చిరాగ్‌ పట్టుబట్టి మరీ ఆ మాటల్ని వెనక్కి తీసుకునేలా చేయటం కూడా పశుపతిలో ఆవేదన రగిల్చింది.

ఇప్పుడు.. పార్టీ పగ్గాలను తాను చేపట్టమే కాకుండా పార్టీ పీఠం నుంచి చిరాగ్‌ను తొలగించటం ద్వారా పశుపతి ఆనాడు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆనాడు తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టిన చిరాగ్‌ ఇప్పుడు సంక్షోభ నివారణకంటూ సోమవారం తన ఇంటి ముందు తచ్చాడటం లోనికి వస్తానంటూ అనుమతి కోరటం గమనార్హం! అంతేగాకుండా చిరాగ్‌ తల్లి (రామ్‌విలాస్‌ పాసవాన్‌ భార్య) సోమవారం పశుపతికి ఫోన్‌ చేసి సర్దిచెప్పటానికి ప్రయత్నించారు.

ఇదీ చదవండి:ఎల్​జేపీ సంక్షోభం: పార్టీపై పట్టుకోల్పోయిన చిరాగ్​- నెక్ట్స్​ ఏంటి?

"వదినా.. ఆరోజు చిరాగ్‌(Chirag Paswan) తప్పు చేసినప్పుడు మీరు చెంపదెబ్బ కొట్టి ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఫోన్‌ చేసి ఏం లాభం?" అంటూ పశుపతి తిరస్కరించారు. మొత్తానికి నీకూనాకూ రక్తసంబంధం లేదన్న చిరాగ్‌ మాటలు ఎల్​జేపీలో తాజా చిచ్చుకు, తనపై తిరుగుబాటుకు కారణమయ్యాయి!

ఐదుగురు ఎంపీలపై చిరాగ్‌ వేటు..

లోక్‌సభలో పశుపతి వర్గాన్ని గుర్తిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించిన నేపథ్యంలో పార్టీ (ఎల్​జేపీ)పై పట్టుకోసం రెండు పక్షాలూ ఎత్తులు వేస్తున్నాయి. తిరుగుబాటు చేసిన ఐదుగురు ఎంపీలపై ఎల్​జేపీ చీలికవర్గం నేత చిరాగ్‌ మంగళవారం వేటు వేశారు. వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు.. తన బాబాయ్‌ పశుపతి సారథ్యంలోని వర్గం.. చిరాగ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన్ను తప్పించిన అసమ్మతి నేతలు.. తాజాగా ఈ మేరకు తీర్మానం చేశారు. సూరజ్‌భాన్‌ సింగ్‌ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. దీంతో చిరాగ్‌ ఒంటరైనట్లు కనిపిస్తోంది. పార్టీలో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల మద్దతు తనకుందని చిరాగ్‌ ధీమాగా ఉన్నారు. ఇక పార్టీ పగ్గాలు ఎవరివనే గొడవ ఎన్నికల సంఘం వద్దకు చేరుతుంది. మరోవైపు.. చిరాగ్‌ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. 'పార్టీ తల్లిలాంటిది. తల్లికి ద్రోహం చేయకూడదు' అంటూ పరోక్షంగా బాబాయ్‌కి సందేశం పంపించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.