చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడ్ని అపహరించినట్లు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్హెచ్ మిరాం తరోన్ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్లు ట్వీట్ చేశారు.
చైనా సైనికుల చెరనుంచి తప్పించుకున్న తరోన్ స్నేహితుడు.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. యువకుడ్ని త్వరగా విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తాపిర్.
షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలిపారు తాపిర్. ఇదే ప్రాంతంలో చైనా 2018లో 3-4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించింది.
ఇద్దరూ జిడో గ్రామానికి చెందిన వేటగాళ్లు అని తెలిపారు ఎంపీ. సాంగ్పో నది అరుణాచల్ప్రదేశ్లోకి ప్రవేశించే చోట ఈ ఘటన జరిగిందని వివరించారు. ఈ నదిని అసోంలో బ్రహ్మపుత్రగా పిలుస్తారు. చైనా చర్య గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశామని, బాధితుడిని త్వరలో విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తాపిర్ తెలిపారు.
-
1/2
— Tapir Gao (@TapirGao) January 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Chinese #PLA has abducted Sh Miram Taron, 17 years of Zido vill. yesterday 18th Jan 2022 from inside Indian territory, Lungta Jor area (China built 3-4 kms road inside India in 2018) under Siyungla area (Bishing village) of Upper Siang dist, Arunachal Pradesh. pic.twitter.com/ecKzGfgjB7
">1/2
— Tapir Gao (@TapirGao) January 19, 2022
Chinese #PLA has abducted Sh Miram Taron, 17 years of Zido vill. yesterday 18th Jan 2022 from inside Indian territory, Lungta Jor area (China built 3-4 kms road inside India in 2018) under Siyungla area (Bishing village) of Upper Siang dist, Arunachal Pradesh. pic.twitter.com/ecKzGfgjB71/2
— Tapir Gao (@TapirGao) January 19, 2022
Chinese #PLA has abducted Sh Miram Taron, 17 years of Zido vill. yesterday 18th Jan 2022 from inside Indian territory, Lungta Jor area (China built 3-4 kms road inside India in 2018) under Siyungla area (Bishing village) of Upper Siang dist, Arunachal Pradesh. pic.twitter.com/ecKzGfgjB7
యువకుడికి సంబంధించి తమకు సమాచారం అందిన వెంటనే భారత సైన్యం- పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని సంప్రదించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రొటోకాల్ ప్రకారం అతడిని గుర్తించి.. భారత్కు అప్పగించాల్సిందిగా కోరినట్లు తెలిపింది.
2020 సెప్టెంబర్లోనూ అరుణాచల్ ప్రదేశ్లో ఐదుగురు యువకులను చైనా సైన్యం అపహరించింది. వారం తర్వాత వారిని విడిచిపెట్టింది.
'మోదీకి పట్టడం లేదా..?'
మిరామ్ తరోన్ కిడ్నాప్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. 'గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు ఓ యువకుడిని చైనా కిడ్నాప్ చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మిరామ్ కుటుంబానికి మేం అండగా ఉంటాం. విశ్వాసం కోల్పోవద్దు. ఓటమిని అంగీకరించొద్దు' అని రాహుల్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఘటనపై మోదీ మౌనంగా ఉన్నారంటే దానర్థం.. ఆయనకు ఏం పట్టడం లేదా? అంటూ దుయ్యబట్టారు.
చైనా స్పందన..
అయితే బాలుడి ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ పేర్కోంది. అక్రమంగా ఎవరైనా తమ భూభాగంలోకి ప్రవేశిస్తే మాత్రం ఎప్పటిలాగే చర్యలు తీసుకుంటామని చెప్పింది.
ఇదీ చూడండి: 'గ్యాంగ్ రేప్' ముఠా అరెస్ట్.. హైవేపై వెళ్లే భార్యాభర్తలే వారి లక్ష్యం!