ETV Bharat / bharat

China: సరిహద్దుల్లో డ్రాగన్‌ 'రెక్కల' చప్పుడు - భారత్ చైనా ఉద్రిక్తతలు

భారత్​తో సరిహద్దుల్లో శాంతిని కోరుకుంటూనే.. కయ్యానికి కాలుదువ్వతోంది చైనా(China). తూర్పు లద్దాఖ్‌లో భారీగా వైమానిక విన్యాసాలు చేస్తూ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. ఈ చర్యలను నిశితంగా గమనిస్తున్న భారత్‌.. అప్రమత్తంగా ఉండాలని వాయుసేనను ఆదేశించింది.

china
సరిహద్దుల్లో డ్రాగన్‌ రెక్కల చప్పుడు
author img

By

Published : Jun 9, 2021, 7:02 AM IST

Updated : Jun 9, 2021, 9:30 AM IST

డ్రాగన్‌(China) తీరు ఏమాత్రం మారలేదు. ఒకపక్క శాంతి వచనాలు పలుకుతూనే మరోపక్క కయ్యానికి కాలుదువ్వుతోంది. తూర్పు లద్దాఖ్‌లోని మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు సంప్రదింపులు జరుపుతూనే కవ్వింపు చర్యలకు చైనా దిగుతోంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి చేరువలో భారీ స్థాయిలో యుద్ధవిమానాలతో విన్యాసాలు చేపట్టింది. ఈ చర్యలను భారత భద్రత దళాలు నిశితంగా గమనిస్తున్నాయి.

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనాల(China) మధ్య ఏడాదిగా సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. ఘర్షణలు కూడా జరిగి, రెండువైపులా ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే. తీవ్ర చర్చల తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయి. మిగతా ప్రాంతాల్లో ఉపసంహరణపై చర్చలు జరిగినా.. ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో సంయమనం పాటించడానికి బదులు రెచ్చగొట్టే చర్యలకు చైనా దిగింది. భారత సరిహద్దులకు చేరువలో 20కిపైగా ఫైటర్‌ జెట్‌లతో ఇటీవల భారీ వైమానిక విన్యాసాలు చేపట్టింది. ఇందులో జె-11, జె-16 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. గతేడాది భారత్‌తో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సమయంలో తమ సైన్యానికి మద్దతుగా వైమానిక కార్యకలాపాలు సాగించిన స్థావరాల కేంద్రంగానే తాజా విన్యాసాలు జరిగాయి. అందువల్ల ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కష్గర్‌, హోటాన్‌, ఎంగారి గున్సా, షిగాట్సే, లాసా గోంగ్కర్‌, నియంగిచి, చాండో పాంట్గా నుంచి ఈ విన్యాసాలు సాగాయి. ఆ సమయంలో చైనా జెట్‌లు హద్దులు దాటలేదని భారత వర్గాలు పేర్కొన్నాయి.

చైనా(China) వైమానిక దళం ఇటీవల ఈ స్థావరాలను భారీగా ఆధునికీకరించింది. యుద్ధవిమానాలను భద్రపరిచేందుకు వీలుగా బాంబులను తట్టుకునేలా కాంక్రీట్‌ షెల్టర్లు నిర్మించింది. రన్‌వేల నిడివిని పొడిగించడం, అదనంగా మానవ వనరులను మోహరించడం వంటివి కూడా చేపట్టింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా పాంగాంగ్‌ సరస్సు వంటి ప్రాంతాల నుంచి తమ సైనికులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ, హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 వంటి గగనతల రక్షణ వ్యవస్థలను అలాగే ఉంచింది.

ఇదీ చదవండి: బలగాల ఉపసంహరణకు చైనా సాకులు!

ఇదీ చదవండి: 'చైనా.. అందుకు సహకరించాల్సిందే'

భారత నిఘా నేత్రం..

చైనా సైనిక కార్యకలాపాలను ఉపగ్రహాలు, ఇతర ఆధునిక నిఘా వ్యవస్థల సాయంతో భారత్‌ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. చైనాలోని షింజియాంగ్‌, టిబెట్‌ స్వయంప్రతిపత్తి సైనిక ప్రాంతంలోని ఏడు డ్రాగన్‌ సైనిక స్థావరాలపై కన్నేసి ఉంచింది. అధునాతన రఫేల్‌ సహా ఈ ప్రాంతంలో మోహరించిన యుద్ధవిమాన స్క్వాడ్రన్లను అప్రమత్తం చేసింది. అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతను కలిగి ఉండాలని వాటిని ఆదేశించింది. ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేలా అవసరమైన సాధన సంపత్తితో సరిహద్దుల్లోని మన సైనిక దళాలు సన్నద్ధంగా ఉన్నాయని అధికారవర్గాలు తెలిపారు. నిజానికి గత ఏడాది నుంచి తూర్పు లద్దాఖ్‌లో మన వైమానిక దళ కార్యకలాపాలు బాగా పెరిగాయి.

టేకాఫ్‌ సామర్థ్యంపై ప్రభావం..

సుఖోయ్‌-30, మిగ్‌-29 సహా అనేక ఫైటర్‌ విభాగాలను ఇక్కడ వాయుసేన మోహరిస్తోంది. రఫేల్‌ జెట్‌లు తరచూ గస్తీ తిరుగుతున్నాయి. గతేడాది ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్నప్పుడు భారత్‌ మెరుపు వేగంతో సుఖోయ్‌-30, మిగ్‌-29లను సరిహద్దుల్లోని వైమానిక స్థావరాలకు తరలించింది. దీంతో తూర్పు లద్దాఖ్‌లో చైనా యుద్ధవిమానాలు సరిహద్దులు దాటే సాహసాన్ని చేయలేదు. ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా భారత వైమానిక దళానిదే పైచేయి. అక్కడ చైనా వైమానిక దళ స్థావరాలు చాలా ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఆక్సిజన్‌ లభ్యత తక్కువగా ఉండటం వల్ల డ్రాగన్‌(China) యుద్ధవిమానాల టేకాఫ్‌ సామర్థ్యంపై ప్రభావం పడుతోంది. ఎక్కువ బాంబులు, క్షిపణులు, ఇంధనాన్ని మోసుకెళ్లలేని పరిస్థితి ఉంది. భారత స్థావరాలు మాత్రం మైదాన ప్రాంతంలో ఉన్నాయి. అందువల్ల అవి సులువుగా, వేగంగా టేకాఫ్‌ కాగలవు. చైనాతో పోల్చినప్పుడు యుద్ధవిమానాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఈ వెసులుబాటు దృష్ట్యా భారత్‌ తన వైమానిక దళాన్ని సమర్థంగా ఉపయోగించుకునే వీలు కలుగుతోంది.

ఇవీ చదవండి: సరిహద్దులో 20 జెట్​లతో చైనా విన్యాసాలు

చైనాలో ముస్లింల పరిస్థితి వింటే వెన్నులో వణుకు!

Last Updated : Jun 9, 2021, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.