ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్​ కేసులో చిదంబరానికి మరిన్ని చిక్కులు - ఐఎన్​ఎక్స్ మీడియా కేసు

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తన కుమారుడి సంస్థ ప్రయోజనాల కోసం ఐఎన్​ఎక్స్​ మీడియా ప్రమోటర్ల సాయం కోరారని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​(ఈడీ) తెలిపింది. ఈ మేరకు మనీలాండరింగ్​ కేసులో ఆయనపై దాఖలు చేసిన అభియోగపత్రంలో ప్రధానంగా పేర్కొంది. ఇందుకు సంబంధించి పలు కీలక ఆధారాలనూ ఈడీ సంపాదించినట్లుగా తెలుస్తోంది.

Chidambaram's direction to INX Media to help Karti important step in money laundering: ED
'తనయుడి కోసం ఐఎన్​ఎక్స్​ సాయం కోరిన చిదంబరం'
author img

By

Published : Mar 25, 2021, 7:21 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​(ఈడీ) దాఖలు చేసిన అభియోగపత్రంలో పలు కీలక వివరాలను పొందుపర్చింది. తన కుమారుడు కార్తీ వ్యాపార ప్రయోజనాల కోసం సాయం చేయాల్సిందిగా ఐఎన్​ఎక్స్​ మీడియా ప్రమోటర్లకు చిదంబరం సూచించారని పేర్కొంది. చిదంబరంపై ఈడీ అభియోగాల్లో ఇదే అత్యంత కీలకమైన అంశమని తెలిపింది.

కీలక ఆధారాలతో ఈడీ..

కార్తీ చిదంబరం తన అడ్వాంటేజ్​ స్ట్రేటజిక్​ కన్సల్టింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్(ఏఎస్​సీపీఎల్​​)​ సంస్థ కోసం సాయం చేయాల్సిందిగా తన తండ్రిని సంప్రదించినట్లుగా ఈడీ తెలిపింది. కార్తీ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్​ పరికరాలు, ఈమెయిల్స్​ విశ్లేషణ ద్వారా ఈ విషయం వెల్లడైందని చెప్పింది. కార్తీ దగ్గర పనిచేసే అకౌంటెంట్​ ఎస్​.ఎస్​ భాస్కరన్​ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు పేర్కొంది.

ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నిందితులు ఏప్రిల్​ 7న కోర్టు ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

ఇంతకీ ఐఎన్​ఎక్స్ కేసు ఏంటి?

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. ఐఎన్​ఎక్స్​ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు ఇవ్వడంలో అవకతవకలకు పాల్పడినట్లు 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ మనీలాండరింగ్ కేసు పెట్టింది. 2018 ఆగస్టు 21న కస్టడీలోకి తీసుకుంది సీబీఐ, అనంతరం అక్టోబర్​ 16న ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈడీ కేసులో డిసెంబర్​ 4, 2019న ఆయనకు బెయిల్​ మంజూరు అయింది.

ఇదీ చూడండి:ఐఎన్​ఎక్స్​ కేసు: చిదంబరంపై ఆరోపణలు ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.