ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​-ఇద్దరు మావోయిస్టులు హతం - ఎన్​కౌంటర్​లో చనిపోయిన నక్సలైట్లు

ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

naxals, encounter
ఎన్​కౌంటర్​
author img

By

Published : Jun 1, 2021, 7:49 PM IST

ఛత్తీస్​గఢ్​ కొండగావ్​ జిల్లాలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకునట్లు పేర్కొన్నారు.

మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్​ పోలీసులకు, నక్సలైట్లకు భీకర కాల్పులు జరిగినట్లు బస్తర్​ రేంజీ ఐజీ సుందర్​ రాజ్​ తెలిపారు. ఛత్తీస్​గఢ్​ రాజధాని రాయ్​పుర్​కు 200 కిమీ దూరంలో ఉన్న కొండగావ్​లో కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు.

'నార్త్ కాంకర్-మెయిన్‌పూర్ డివిజన్ కోఆర్డినేషన్ కమిటీ'కి చెందిన మావోయిస్టులు ఉన్నట్లు సోమవారమే సమాచారం అందగా.. ఈ ఆపరేషన్​ను ప్రారంభించినట్లు వివరించారు.

ఇదీ చూడండి: ఆ గ్రామంలో ఒక్క నెలలో 80మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.