ETV Bharat / bharat

విడివిడిగా పెళ్లిళ్లు.. ఆమెకు ఇద్దరు, అతడికి నలుగురు పిల్లలు.. ట్రయాంగిల్​ లవ్​ స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు

వారిద్దరూ బంధువులు. ఇద్దరికీ విడిగా పెళ్లిళ్లు అయ్యాయి. తరచూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్తుండడం వల్ల వారి మధ్య ప్రేమ చిగురించి, ఇళ్లు వదిలి వెళ్లిపోయే వరకు వచ్చింది. ప్రేమికుడు​ లేకుండా బతకలేనని మహిళ అంటుంటే.. తన భార్య లేకుండా బతకలేనని ఆమె భర్త అంటున్నాడు. ఈ వింత లవ్​ స్టోరీని పరిష్కరించలేక పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

strange love story in chhattisgarh-
strange love story in chhattisgarh-
author img

By

Published : Dec 8, 2022, 10:03 AM IST

వారిద్దరికీ విడిగా వివాహాలు అయ్యాయి. చుట్టాలు కావడం వల్ల తరచూ ఒకరింటికి ఒకరు వెళ్తుంటారు. అలా వారి మధ్య చిగురించిన ప్రేమ.. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సమస్యను పరిష్కరించలేక తలలు పట్టుకుంటున్నారు. ఈ వింత ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జీవన్​లాల్​ పానికా అనే వ్యక్తి తన కుటంబంతో కలిసి మార్వాయి పోలీస్​ స్టేషన్ పరిధిలోని చార్​చేది అనే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య ఫూల్​కున్వర్​తో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. అతడి బంధువులైన రాజేంద్ర ప్రసాద్ పానికా​ భార్య రాఖీ పూరితో పాటు పెంద్రా అనే గ్రామంలో నివసిస్తున్నాడు. తరచూ జీవన్​లాల్​, రాజేంద్ర ప్రసాద్​ కుటుంబాలు ఒకరింటికి ఒకరు వెళ్తుండేవి.

ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్​ భార్య రాఖీపూరి, జీవన్​లాల్​ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారిద్దరూ అదును చూసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఆరు రోజుల తర్వాత రాఖీ పూరి బంధువులు.. జీవన్​లాల్​ ఇంటికి వెళ్లారు. వీరందరినీ రాజేంద్ర ప్రసాద్​ తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికి రాఖీ-జీవన్ జంట తిరిగి వచ్చింది.

పోలీస్​ స్టేషన్​కు చేరిన పంచాయితీ..
రాఖీపూరి భర్త రాజేంద్ర ప్రసాద్​, ప్రేమికుడు జీవన్​ లాల్​​ మధ్య పెద్ద గొడవ జరిగింది. వారు పరస్పరం పోలీస్​ స్టేషన్​లో కేసులు పెట్టుకున్నారు. మరోవైపు, భర్త వద్దకు వెళ్లాలని లేదని.. అతడు తనను వేధిస్తున్నాడని.. రాఖీపూరి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. మరోవైపు, తమపై దాడి చేశాడని జీవన్​ లాల్​ తల్లి రాజేంద్ర ప్రసాద్​పై పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టింది.

నేను అతడి వద్దకు వెళ్లను.. భర్తపై కేసు..
తన లవర్​ జీవన్​లాల్​ లేకుండా తాను బతకలేనని రాఖీపూరి చెప్పింది. కాగా, తన భార్య రాఖీపూరి లేకుండా తాను బతకలేనని రాజేంద్ర ప్రసాద్​ అంటున్నాడు. మరోవైపు, తన భర్త మరో మహిళను తీసుకొచ్చినా తనకు ఏం అభ్యంతరం లేదని.. ఆమెతో నేను సంతోషంగానే ఉంటానని జీవన్​లాల్​ భార్య అంటోంది. దీంతో వింత లవ్​స్టోరీని ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
'ప్రస్తుతం రాఖీపూరిని తన తల్లిదండ్రులకు అప్పగించాం. ఆమె బంధువులందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. రాఖీపూరి తన భర్తపై చేసిన ఆరోపణలపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఆ మహిళ మేజర్​. కాబట్టి ఆమె తన భర్తతో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు.' అని పోలీసులు చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.