ETV Bharat / bharat

సీఎం తండ్రి అరెస్ట్- 15 రోజులు జైలులోనే! - సీఎం తండ్రి అరెస్ట్

ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ (Nand Kumar Baghel arrested) అరెస్టయ్యారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఓ సామాజిక వర్గం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో.. ఆయనకు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Nand Kumar Baghel arrested
నందకుమార్ బఘేల్ అరెస్ట్
author img

By

Published : Sep 7, 2021, 3:40 PM IST

Updated : Sep 7, 2021, 4:27 PM IST

ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ (Nand Kumar Baghel) అరెస్టయ్యారు. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అదుపులోకి (Nand Kumar Baghel arrested) తీసుకున్నారు. రాయ్​పుర్​లోని న్యాయస్థానంలో నందకుమార్​ను హాజరుపర్చగా... ఆయనకు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

బెయిల్ కోసం దరఖాస్తు చేసే అవకాశమున్నా... నంద కుమార్ వద్దన్నారని ఆయన తరఫు న్యాయవాది గజేంద్ర శంకర్ వెల్లడించారు. ఈనెల 21న ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరుపరుచుతారని చెప్పారు.

సీఎం స్పందన ఇలా...

ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బఘేల్. ఆ వర్గానికి చెందిన నేతల ఫిర్యాదుతో రాయ్‌పుర్‌లోని దీన్‌దయాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నందకుమార్‌పై కేసు నమోదైంది.

ఈ అంశంపై ఇదివరకే స్పందించిన ముఖ్యమంత్రి భూపేశ్(bhupesh baghel).. చట్టానికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించడం గమనార్హం. తన తండ్రి తప్పుందని తేలితే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఛత్తీస్‌గఢ్​ సీఎం స్పష్టంచేశారు.

ఇదీ చదవండి: టీ తోటల్లో పిడుగులు.. 24 మందికి తీవ్రగాయాలు

Last Updated : Sep 7, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.