ETV Bharat / bharat

అభినవ సావిత్రి.. భర్త విడుదల కోసం నక్సల్స్​తో పోరాటం! - మావోయిస్టు న్యూస్

అలనాటి సతీసావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను కాపాడుకుందని పురాణాల్లో చదువుకున్నాం. అయితే అడవుల బాట పట్టి మావోయిస్టుల చెరలో ఉన్న తన భర్తను రక్షించుకుంది ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh Bijapur news today) ఓ ఇంజినీర్‌ భార్య. రెండేళ్ల బిడ్డను ఎత్తుకొని అడవుల్లోకి వెళ్లిన ఆమె తన భర్తను విడిచిపెట్టాలని మావోయిస్టులను వేడుకుంది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన నక్సల్స్ ఇంజినీర్‌ను విడుదల చేశారు.

BIJAPUR WOMAN NAXAL
BIJAPUR WOMAN NAXAL
author img

By

Published : Nov 17, 2021, 7:26 PM IST

భర్తను విడిచిపెట్టాలని ప్రజాకోర్టులో ప్రాధేయపడుతున్న అర్పిత

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు (Chhattisgarh Bijapur news today) కిడ్నాప్‌ చేసిన... ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు విముక్తి లభించింది. బీజాపూర్ జిల్లా (Chhattisgarh Bijapur naxal) మాన్ కేళి, ఘడ్ గోర్ణ రోడ్డు నిర్మాణ పనులను గత గురువారం పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. సబ్ ఇంజినీర్ అజయ్‌ రోషన్‌తో పాటు అటెండర్‌ను... మావోయిస్టులు అపహరించుకెళ్లారు.

శుక్రవారం అటెండర్ లక్ష్మణ్​ను విడిచిపెట్టిన మావోయిస్టులు (Chhattisgarh Bijapur news today) అజయ్‌ రోషన్‌ను మాత్రం తమ దగ్గరే ఉంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అజయ్‌ భార్య అర్పిత కన్నీరుమున్నీరైంది. భర్త తప్ప తనకు మరో దిక్కులేదని ఆయన ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయని తెలిసి బోరుమంది. అయితే వెంటనే తేరుకున్న ఆమె... తన భర్తను ఎలాగైనా విడిపించుకోవాలని సంకల్పించింది. స్థానిక జర్నలిస్టులు, సామాజికవేత్తల సాయం కోరింది. అంతటితో ఆగకుండా నాటి సతీసావిత్రిని గుర్తుచేసుకుందో ఏమో తెలియదుగానీ.. తన భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది. రెండేళ్ల బిడ్డను ఎత్తుకొని.. కిలోమీటర్ల కొద్ది కాలినడకనే ప్రయాణం సాగించింది.

BIJAPUR WOMAN NAXAL
అజయ్‌రోషన్‌, అర్పిత

క్షమించాలని వేడుకొని..

చివరకు మావోయిస్టుల వద్దకు చేరుకున్న అర్పిత తన పరిస్థితిని వారికి వివరించింది. భర్త, బిడ్డ తప్ప తనకు మరో దిక్కులేదని, అజయ్‌ ఏదైనా తప్పు చేస్తే పెద్దమనసుతో క్షమించాలని ప్రాధేయపడింది. సామాజికవేత్తలు సైతం అర్పిత పరిస్థితిని మావోయిస్టులకు వివరించారని తెలిసింది. ఇలా అర్పిత చేసిన పోరాటం మావోయిస్టుల హృదయాలను కదిలించింది. బీజాపూర్‌లో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు చివరకు ఇంజినీర్‌ అజయ్‌ను విడుదల చేశారు. అజయ్‌ కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతం కాగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అర్పిత పోరాటంతో అజయ్ రోషన్​ విడుదల

ఇదీ చదవండి: హైదర్​పొరా ఎన్​కౌంటర్​పై కశ్మీర్​లో రగడ- ఆ జిల్లాలో ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.