ETV Bharat / bharat

ఆఫీస్​లోని వారందరినీ బెదిరించి 30లక్షలు చోరీ, పారిపోతుండగా యాక్సిడెంట్

ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ సిబ్బందిని బెదిరించి రూ. 30లక్షలు దోచుకెళ్లారు ఏడుగురు దుండగులు. పారిపోతుండగా బైక్​కు ప్రమాదం జరిగి ఒకడు పట్టుబడ్డాడు. ఈ ఘటన చెన్నైలోని వడపళనిలో జరిగింది.

chennai robbery case
ఆఫీస్​లోని వారందరినీ బెదిరించి 30లక్షలు చోరీ, పారిపోతుండగా యాక్సిడెంట్
author img

By

Published : Aug 17, 2022, 5:25 PM IST

Chennai robbery case : చెన్నైలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ఓ ప్రైవేటు ఫైనాన్స్​ కంపెనీ కార్యాలయంలోకి ఏడుగురు దుండగులు చొరబడి ఏకంగా రూ.30లక్షలు దోచుకెళ్లారు. పారిపోతున్న దొంగలను పట్టుకునేందుకు ఆ సంస్థ యజమాని, ఉద్యోగులు చేసిన ప్రయత్నం.. సినిమాను తలపించింది. చివరకు ఛేజింగ్​ జరుగుతుండగా బైక్​కు ప్రమాదం జరిగి ఒక దుండగుడు పట్టుబడ్డాడు. మిగిలిన వారు పారిపోయారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది.

కత్తులతో బీభత్సం సృష్టిస్తూ.. తమిళనాడులోని కిల్పక్కానికి చెందిన కరుణానిధి, కరూర్ జిల్లాకు చెందిన వెంకటేశన్, శరవణన్​ కలిసి ఓజోన్ కేపిటల్ పేరిట ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారు. చెన్నై వడపళనిలో ఆ సంస్థ కార్యాలయంలోకి మంగళవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు చొరబడ్డారు. లోపల ఉన్న వారందరినీ కత్తులతో బెదిరించారు. లాకర్​లో ఉన్న రూ.30లక్షలు లాక్కున్నారు. ఏం జరుగుతుందో ఆలస్యంగా తెలుసుకున్న యజమాని శరవణన్​.. దుండగులు లోపల ఉండగానే ఆఫీసుకు తాళం వేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అయితే.. లోపలున్న దొంగలు తలుపులు పగలకొట్టి పారిపోయే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న నవీన్​ అనే ఉద్యోగిని చితకబాది, ఆఫీస్​ నుంచి బయటపడ్డారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో పారిపోయారు. అయితే.. శరవణన్​, ఇతర ఉద్యోగులు దుండగుల్ని కారులో వెంబడించారు. ఈ క్రమంలో తిరునగర్​లో ఇద్దరు దుండగులు ప్రయాణిస్తున్న బైక్​ ప్రమాదానికి గురైంది. అయినా ఒకడు అదే వాహనంపై పారిపోగా.. మరొకడిని శరవణన్​ బృందం పట్టుకుని పోలీసులకు అప్పగించింది.

పట్టుబడిన వ్యక్తిని విరుగంబాకానికి చెందిన సయ్యద్ రియాజ్(22)గా గుర్తించారు. అతడితోపాటు ఇస్మాయిల్, భరత్, కిశోర్, జానీ, తమిళ్, మొట్టై అనే వ్యక్తులు ఈ దోపిడీలో పాలుపంచుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పరారైన వారి కోసం గాలిస్తున్నారు.
ఇటీవల చెన్నైలోని అరుంబాకంలో ఓ బ్యాంకు నుంచి ఇదే తరహాలో కొందరు దుండగులు 32 కిలోల బంగారం దోచుకెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.