Chennai Floods News: చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకు(chennai rain) నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాంబరంలో చాలామంది వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని అగ్నిమాపక సిబ్బంది పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని చోట్ల రోడ్లు, దిగువ ప్రాంతాలు, ఇళ్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. హౌసింగ్ బోర్డుల్లోకి కూడా నీరు చేరడం వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. దీంతో జనాల రోజువారీ జీవితాన్ని ప్రభావితమైంది. అగ్నిమాపక సిబ్బంది బోట్ల ద్వారా ఆ ప్రాంతాలకు చేరుకుని... ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి వసతి, ఆహారాన్ని అందించారు.
చెన్నై నగరంలోని చాలా ప్రాంతాలు, శివార్లోని ఆలందూరు, పజవంతాంగల్, ఎయిర్పోర్ట్ ప్రాంతం, పల్లవరం, తాంబరం, పెరుంగళత్తూరు, వండలూరు, సెలైయూర్, క్రోంపేటైల్లో ఇప్పటికీ భారీ వర్షలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
నగరంలోని వ్యాసర్‌పాడి సబ్‌వేలో వరదనీరు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ బస్సు సబ్‌వేను ఢీ కొట్టింది. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో వరద నీరు (Chennai Floods ) రోడ్లపై నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి సమీక్ష..
చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం పర్యటించారు. పులియంతౌపు, అంబేద్కర్ సాలై, పెరంబూర్ లాంటి తదితర ప్రాంతాల్లో మంత్రులు కెఎన్ నెహ్రూ, శేఖర్‌బాబుతో కలిసి సీఎం స్టాలిన్ క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్షించారు.
ఇదీ చూడండి: రెసిడెన్షియల్ పాఠశాలలో 26 మంది విద్యార్థినులకు కరోనా