ఈరోజు (18-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
- శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం
- శుక్లపక్షం త్రయోదశి: సా. 6.14 తదుపరి చతుర్దశి
- పూర్వాభాద్ర: మ.12.06
- ఉత్తరాభాద్ర వర్జ్యం: రాత్రి 10.00 నుంచి 11.40 వరకు
- అమృత ఘడియలు: లేవు
- దుర్ముహూర్తం: మ.12.08 నుంచి 12.54 వరకు తిరిగి మ.2.27 నుంచి 3.14
- రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00
- సూర్యోదయం: ఉ.5-56, సూర్యాస్తమయం: సా.5 34
మేషం..
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
వృషభం..
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభ వార్త ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
మిథునం..
కీలక నిర్ణయాలను అమలు చేసేముందు బాగా అలోచించి ముందుకు సాగాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీగణపతి సందర్శనం శక్తినిస్తుంది
కర్కాటకం..
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
సింహం..
మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభాన్నిస్తుంది.
కన్య..
కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది.
తుల..
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఒక వార్త ఇబ్బందినిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం..
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతిని ఆరాధించడం మంచిది.
ధనుస్సు..
ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
మకరం..
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేదాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.
కుంభం..
చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.
మీనం..
కాలం అనుకూలంగా ఉంది. శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటి వారితో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.