ETV Bharat / bharat

జేఈఈ మెయిన్స్ షెడ్యూల్​ మార్పు- కొత్త తేదీలివే..

జేఈఈ మెయిన్ నాలుగో విడత షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే.. నాలుగో ఎడిషన్ జేఈఈ దరఖాస్తుల గడువు ఈనెల 20 వరకు పొడిగించింది.

JEE
జేఈఈ
author img

By

Published : Jul 15, 2021, 7:06 PM IST

Updated : Jul 15, 2021, 8:02 PM IST

జేఈఈ మెయిన్స్-2021 పరీక్షల నాలుగో ఎడిషన్ తేదీలో మార్పులు చేసింది కేంద్ర విద్యాశాఖ. మూడు, నాలుగు ఎడిషన్ల మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండేలా చూడాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దీని ప్రకారం నాలుగో ఎడిషన్​ను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో నిర్వహించనున్నారు.

"విద్యార్థుల డిమాండ్​తో పాటు.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వారికి తగినంత సమయం ఉండేదుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాం."

-ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి

ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 20- 25 వరకు మూడో​ ఎడిషన్, జులై 27- ఆగస్టు 2 మధ్య నాలుగో ఎడిషన్ నిర్వహించాల్సి ఉంది. మొత్తం 7.32 లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే జేఈఈ(మెయిన్స్)-2021 నాలుగో ఎడిషన్​ పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. ఇప్పుడు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది కేంద్ర విద్యాశాఖ.

ఇవీ చదవండి:

Last Updated : Jul 15, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.