ETV Bharat / bharat

Chandrayaan 3 VS Chandrayaan 2 : ఓటమి నేర్పిన పాఠం.. చంద్రయాన్​-3 సాఫ్ట్​ ల్యాండింగ్​ ఖాయం! - చంద్రయాన్ 2 వర్సెస్ చంద్రయాన్ 3

Chandrayaan 3 Failure Based Design : చంద్రయాన్‌-2 మిషన్‌లో విక్రమ్‌ ల్యాండర్‌ను జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయడంలో విఫలమైన ఇస్రో ఈసారి ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఈసారి ఎన్ని సమస్యలు ఎదురైనా చంద్రునిపై ల్యాండర్‌ సురక్షితంగా, మృదువగా దిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అమెరికా, రష్యా, చైనా లాంటి అంతరిక్ష దిగ్గజాలకు అందని ద్రాక్షగా ఉన్న చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయమని ఇస్రో కృతనిశ్చయంతో ఉంది.

Chandrayaan 3 Failure Based Design
Chandrayaan 3 Failure Based Design
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 3:55 PM IST

Chandrayaan 3 Failure Based Design : జాబిల్లిపై ఇప్పటివరకు ఏ దేశమూ చేరుకోని దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకను సురక్షితంగా దించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్ధమైంది. చంద్రయాన్‌-2 సమయంలో ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈసారి మన వ్యోమనౌక చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగడం ఖాయమంటోంది. చంద్రయాన్‌-2 విషయంలో ఇస్రో సక్సెస్‌ బేస్డ్‌ మోడల్‌ను అనుసరించగా చంద్రయాన్‌-3ని మాత్రం ఫెయిల్యూర్‌ బేస్డ్‌ డిజైన్‌తో ఇస్రో రూపొందించింది. వైఫల్యాలకు ఉన్న ఆస్కారాలను విశ్లేషించుకొని, వాటిని అధిగమించేలా ఇస్రో చంద్రయాన్‌-3ని రూపొందించింది. అనుకోని అవాంతరం తలెత్తినా ల్యాండర్‌.. విజయవంతంగా చంద్రుడిపై దిగేలా కసరత్తు చేసింది. సెన్సర్‌, ఇంజిన్‌, అల్గోరిథమ్‌, గణన.. ఇలా అనేక అంశాల్లో వైఫల్యాలకు ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంది. వాటిని అప్పటికప్పుడు సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని వ్యవస్థలనూ ప్రోగ్రామ్‌ చేసింది. చంద్రయాన్‌-3లో అన్ని సెన్సర్లూ పనిచేయకపోయినా, నాలుగింట్లో రెండు ఇంజిన్లు విఫలమైనా జాబిల్లిపై సురక్షితంగా దిగేలా తీర్చిదిద్దారు. అందుకే ఈసారి చరిత్ర సృష్టించడం ఖాయమని ఇస్రో కృతనిశ్చయంతో ఉంది.

చంద్రయాన్​-2 వైఫల్యానికి కారణమిదే..
చంద్రయాన్‌-2 వైఫల్యానికి ప్రధాన కారణం- ఇంజిన్లు అధిక థ్రస్టును ఉత్పత్తి చేయడమే. అందులోని నియంత్రణ వాల్వ్‌ సరైన రీతిలో ప్రతిస్పందించలేదు. దాన్ని ఇప్పుడు సరిచేశారు. కంట్రోల్‌ లాజిక్‌ను మెరుగుపరిచారు. చంద్రయాన్‌-2 ల్యాండింగ్‌కు 500 బై 500 మీటర్ల ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఈసారి 4 బై 2.5 కిలోమీటర్ల ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అందువల్ల కొద్దిపాటి ప్రదేశంలోనే హడావుడిగా దిగాలన్న పరిమితులేమీ ఉండవు. నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశంలో దిగలేకపోతే చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ప్రత్యామ్నాయాలను వెతుకుతుంది. అవసరమైతే 150 మీటర్ల వరకు పక్కకు వెళ్లగలదు. ఇందుకు అనుగుణంగా ఇంధనం పరిమాణాన్ని పెంచారు. అనూహ్య పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సౌకర్యాన్నీ కల్పించారు. ఇవేవీ చంద్రయాన్‌-2లో లేవు. బ్యాటరీల సామర్థ్యం చంద్రయాన్‌-2లో 52.5 ఏహెచ్‌గా ఉండగా ఇప్పుడు 63 ఏహెచ్‌కు పెంచారు. ల్యాండర్‌ ఏ దిశలో దిగినా సమర్థంగా సౌరశక్తిని ఒడిసిపట్టేలా సోలార్‌ ప్యానళ్లను పెంచారు.

Chandrayaan 2 Failure : చంద్రయాన్‌-2లో ఒక ప్రధాన ఇంజిన్‌.. దాని చుట్టూ 4 చిన్న ఇంజిన్లు ఉన్నాయి. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌లోని హైరిజల్యూషన్‌ కెమెరా.. చంద్రుడికి సంబంధించిన చిత్రాలను 25 సెంటీమీటర్ల స్పష్టతతో అందించింది. వాటి ఆధారంగా చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌కు సురక్షితమైన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకోగలిగారు. చంద్రయాన్‌-2లో సాఫ్ట్‌వేర్‌, గైడెన్స్‌ అల్గోరిథమ్‌ వైఫల్యాలు తలెత్తాయి. ఫలితంగా ఓ దశలో- నిర్దేశించిన దానికంటే ఎక్కువ వేగంగా ల్యాండర్‌ ప్రయాణించి జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఆ వ్యవస్థలను పటిష్ఠం చేశారు. ల్యాండింగ్‌ చివరి అంకంలో 3 మీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ ఒకింత దబ్‌మని పడిపోతుంది. అప్పుడు చెలరేగే కుదుపును తట్టుకొనేలా కాళ్లను డిజైన్‌ చేశారు. తద్వారా వ్యోమనౌక నిర్మాణం, దాని లోపలి పరికరాలకు ఎలాంటి ఇబ్బంది కలగదు.

Chandrayaan 3 Failure Based Design
చంద్రయాన్ 3 ప్రయోగం

Chandrayaan 3 VS Chandrayaan 2 : చంద్రయాన్‌-3 ల్యాండర్‌ పాదం భాగాన్ని డాంపర్‌ పదార్థంతో తయారుచేశారు. తేనెతుట్టెలా ఉండే ఈ భాగం కుదుపులో చాలా భాగాన్ని గ్రహించుకుంటుంది. సెకనుకు రెండు మీటర్ల వేగాన్ని తట్టుకునేలా చంద్రయాన్‌-2 ల్యాండర్‌ను రూపొందించగా ఇప్పుడు దాన్ని మూడు మీటర్లకు పెంచారు. చంద్రయాన్‌-2లో టెలిమెట్రీ డేటా రేటు.. 1 కేబీపీఎస్‌. ఇప్పుడు దాన్ని 4 కేబీపీఎస్‌కు పెంచారు. ఎక్స్‌ బ్యాండ్‌ డేటా రేటును 200 కేబీపీఎస్‌ నుంచి 500 కేబీపీఎస్‌కు పెంచారు. దీనివల్ల కీలక పరామితులను వేగంగా సేకరించి, భూకేంద్రానికి పంపడం వీలవుతుంది. అలాగే మరిన్ని కమ్యూనికేషన్‌ యాంటెన్నాలను చంద్రయాన్‌-3 ల్యాండర్‌కు అమర్చారు. ఫలితంగా.. వ్యోమనౌక దృక్కోణం ఎటువైపు ఉన్నా కంట్రోల్‌ సెంటర్‌తో కమ్యూనికేషన్‌ నిరాటంకంగా సాగుతుంది. చంద్రుడు ఉపరితలం ఎగుడుదిగుడుగా ఉంటుంది. పెద్ద రాళ్లుంటాయి. చదునుగా లేని ఉపరితలంపై ల్యాండర్‌ దిగితే.. వ్యోమనౌక స్థిరంగా ఉండదు. వాలు ఎక్కువగా ఉన్నచోట దిగితే ల్యాండర్‌ పక్కకు ఒరిగిపోయే ప్రమాదం ఉంది. ల్యాండింగ్‌ తర్వాత ర్యాంపు విచ్చుకొని.. చందమామ ఉపరితలానికి ఆనుకోవాలి. దానిమీద నుంచి జారుతూ ల్యాండర్‌లోని రోవర్‌.. ఉపరితలాన్ని చేరుకోవాలి. ల్యాండింగ్‌ చోట వాలు ఎక్కువగా ఉంటే, ర్యాంప్‌ పొడవు సరిపోదు. ల్యాండర్‌ స్థిరత్వం లేక అటూఇటూ ఊగుతూ ఉంటే.. వెలుపలికి వచ్చేటప్పుడు రోవర్‌ బోల్తా పడొచ్చు. అందువల్ల వాలుకు తగ్గట్లు ల్యాండర్‌కు సర్దుబాటు కాళ్లు అమర్చారు. ఒక కాలు చిన్నపాటి గోతిలో పడినా ఇబ్బంది ఉండదు. కాలు పొడవును ల్యాండర్‌ పెంచుకొని స్థిరత్వం సాధిస్తుంది.

చంద్రయాన్‌-2లో ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా ఉంది. అయితే అది తీసిన ఫొటోలను.. కమ్యూనికేషన్‌ వ్యవస్థ అప్పటికప్పుడు భూమికి చేరవేయలేదు. ఇప్పుడు చంద్రయాన్‌-3లో కమ్యూనికేషన్‌ వ్యవస్థను పటిష్ఠం చేయడం వల్ల.. ల్యాండర్‌ తాను తీసిన ఫొటోలను వేగంగా అందిస్తుంది. ల్యాండింగ్‌ క్రమంలో జాబిల్లి ఉపరితలంపై ఎదురయ్యే అవరోధాలను గుర్తించి, వాటి నుంచి పక్కకు జరిగే అటానమస్‌ హజార్డ్‌ డిటెక్షన్‌, అవాయిడెన్స్‌ విన్యాసంలో అవి ఉపయోగపడతాయి. ల్యాండర్‌లోని కృత్రిమ మేధ వ్యవస్థ వీటిని ప్రాసెస్‌ చేస్తుంది. వాటి ఆధారంగా నేవిగేషన్‌, గైడెన్స్‌ సాగుతుంది. ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా తీసిన చిత్రాలు కళ్లు, చెవుల్లా పనిచేస్తాయి.

Chandrayaan 3 Failure Based Design
చంద్రయాన్ 3 ప్రయోగం

Chandrayaan 3 Launch Date On Moon : మరోవైపు.. చంద్రయాన్-3 ప్రయోగం షెడ్యూల్ ప్రకారం సాఫీగా సాగుతోందని ఇస్రో మంగళవారం ప్రకటించింది. చంద్రయాన్​-3 మిషన్​లో భాగంగా ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా(ఎల్​డీపీసీ).. ఆగస్టు 19న తీసిన జాబిల్లి ఫొటోలను విడుదల చేసింది. ఆగస్టు 23 సాయంత్రం ఆరు గంటలు నాలుగు నిమిషాలకు చంద్రునిపై వ్యోమనౌకను ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో ప్లాన్ చేసింది. అయితే.. పరిస్థితులు అనుకూలించకపోతే ఆగస్టు 27న జాబిల్లిపై వ్యోమనౌకను ల్యాండింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు.

Chandrayaan 3 : కీలక దశకు చంద్రయాన్​-3.. బుధవారం ఏం జరగనుంది? లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Chandrayaan 3 Moon Images : కెమెరామ్యాన్ 'విక్రమ్​'తో 'ఇస్రో'.. భూమికి కన్పించని జాబిల్లి అవతలి వైపు ఫొటోలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.