ETV Bharat / bharat

Chandrababu Suffering from Severe Health Issues: ఆందోళన కలిగిస్తున్న చంద్రబాబు ఆరోగ్య సమస్యలు.. నడుం కింది వరకు విస్తరించిన దద్దుర్లు

Chandrababu Suffering from Severe Health Issues: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇప్పటికే ఆయన కంటి సమస్యలతో బాధపడుతుండగా.. తాజాగా మరో షాకింగ్ విషయం తెలిసింది. ఒంటిపై దద్దుర్లు నడుం వరకు విస్తరించాయని తెలుస్తోంది.

Chandrababu Suffering from Severe Health Issues

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 6:59 AM IST

Chandrababu Suffering from Severe Health Issues: ఆందోళన కలిగిస్తున్న చంద్రబాబు ఆరోగ్య సమస్యలు.. నడుం కింది వరకు విస్తరించిన దద్దుర్లు

Chandrababu Suffering from Severe Health Issues: రాజమండ్రి కేంద్రకారాగారంలో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో (Chandrababu Health Problems) బాధపడుతున్నారు. ఏడు పదుల వయసులో ఆయనకు కంటి సమస్యలతో పాటు ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. కుడి కంటికి సత్వరమే శస్త్రచికిత్స (Eye Operation for Chandrababu) చేయాలని ఎల్వీ ప్రసాద్‌ నేత్రవైద్యశాల నిపుణులు సూచించారు. అదే విధంగా ఆయనకు వెంటనే వివిధ రకాల వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబుకు గతంలో కంటి వైద్యం చేసిన హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణులు.. ఆయనకున్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ నెల 21న ఓ నివేదికలో వివరించారు. చంద్రబాబుకు 'యాంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా' అనే కంటి సమస్య ఉన్నట్టు 2016లో గుర్తించారు. దానికి లేజర్‌ చికిత్స చేశారు. ఇంట్రా ఆక్యులర్‌ ప్రెజర్​ను ఎప్పటికప్పుడు.. నిర్దిష్ట కాలావధుల్లో ఆసుపత్రిలో వైద్య నిపుణులు పర్యవేక్షించాలి.

Chandrababu Health Update: "చంద్రబాబు కంటికి చికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యుల నివేదిక.. కానీ.."

అలాగే ఆయనకు కంటిలో శుక్లాలు ఏర్పడినట్లు ఈ ఏడాది మే 23న గుర్తించి, జూన్‌ 21న ఎడమ కంటికి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున.. 3 నెలల్లో కుడి కంటి శుక్లానికి కూడా సర్జరీ చేయాలని ఎల్‌వీ ప్రసాద్‌ వైద్యులు సూచించారు. అది కూడా ఇంట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ను మేనేజ్‌ చేస్తూ, గ్లకోమా వైద్య నిపుణుల పర్యవేక్షణలో, అన్ని వసతులూ ఉన్న ఐ ఇనిస్టిట్యూట్‌లోనే చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అదే విధంగా చంద్రబాబు మరికొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు బుధవారం ఆయన్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్య నిపుణులు ఇచ్చిన నివేదికను బట్టి తెలుస్తోంది. బాబు వెన్ను కింది భాగంలో నొప్పి, మలద్వారం వద్ద నొప్పితో బాధపడుతున్నారని, ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించాయని (Chandrababu Skin Allergy) ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆయనకు కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్, రీనల్‌ ఫంక్షన్‌ టెస్ట్‌లు, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌లు, సీరం ఎలక్ట్రోలైట్స్, కోగ్యులేషన్‌ ప్రొఫైల్, ఎహెబీఏ1సీ , కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్, ఈసీజీ, ఎక్స్‌-రే చెస్ట్, 2డీ ఎకో వంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

Chandrababu Health Condition: చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు.. శీతల వాతావరణం తప్పనిసరి

చంద్రబాబు ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు చల్లటి వాతావరణాన్ని కొనసాగించాలని, శరీరానికి బాగా గాలి తగిలే దుస్తులు ధరించాలని సూచించినట్లు సమాచారం. ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవద్దని, సౌకర్యంగా ఉండే కుర్చీని వాడాలని చెప్పినట్లు తెలిసింది. తాజా నివేదికలతో చంద్రబాబు ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది.

Chandrababu Illness In Jail: ఎండవేడిమి, ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ.. వైద్య పరీక్షలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.