Global Forum for Sustainable Transformation program: టెక్నాలజీ, పాలసీలు సమర్థంగా అమలు చేస్తే.. పేదరికం లేని సమాజాన్ని నిర్మించవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పీపుల్ పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ అనే పీ4 విధానంతోనే 2047కల్లా భారతదేశం ఆర్థిక వ్యవస్థలో నెంబర్ వన్ అవుతుందని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడమే కాకుండా.. దాన్ని అన్ని వర్గాలకు పంచేలా పాలసీలు ఉండాలని, అప్పుడే పేదలు ధనికులుగా మారతాని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఎఫ్‌ఎస్‌టీ) ఆధ్వర్యంలో డీప్ టెక్నాలజీస్ అనే అశంపై సదస్సు నిర్వహించారు. జీఎఫ్‌ఎస్‌టీ. ఛైర్మన్ వ్యవహరిస్తున్న చంద్రబాబు ఈ సదస్సులో పాల్గొన్నారు. పాలసీ మేకర్స్ సంప్రదాయ పద్ధతుల్లో ఆలోచిస్తే మంచి ఫలితాలు రావని చంద్రబాబు వెల్లడించారు. సమాజంలో సమూల మార్పులు తేవడమే తన జీవిత లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ నంబర్-1 ఆర్థిక వ్యవ్యస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాట్ జీపీటీ, ఏఐ వంటి సాంకేతికతను సమర్థంగా వాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
మితిమీరిన టెక్నాలజీతో ఉద్యోగ భద్రతకు ముప్పు అనే వాదనను చంద్రబాబు తప్పుబట్టారు. ఉద్యోగ కల్పనకు సాంకేతికత కొత్త మార్గాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. సమస్యలున్నాయని టెక్నాలజీని దూరంగా పెట్టలేమన్న చంద్రబాబు... టెక్నాలజీని నిలువరించే ప్రయత్నం చేసినా అది ఫలించదని వెల్లడించారు. పాలసీల ద్వారా లబ్ధిపొందిన వర్గాలు సమాజానికి ఎంచో కొంత తిరిగి ఇవ్వాలని సూచించారు. డిజిటల్ కరెన్సీ రావాలనేది నా బలమైన కోరిక అని చంద్రబాబు వెల్లడించారు. పెద్దనోట్లు రద్దయితే బ్లాక్‌మనీ సహా అన్నింటికీ చెక్ పడుతుందన్న చంద్రబాబు.. ప్రభుత్వాల ఆదాయాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. తద్వారా పేద ప్రజలకు ప్రభుత్వాలు పెద్దఎత్తున ఖర్చు పెట్టవచ్చుని తెలిపారు
ఓటింగ్ పెంపుపై చైతన్యం తెస్తే దేశానికి మంచి నాయకత్వం అందుతుందన్న చంద్రబాబు.. రాజకీయాల్లోకి మంచివారు రావాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో అన్ని వర్గాలు ఓటింగ్‌లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పూర్ టు రిచ్ అనేది తన మనసుకు దగ్గరైన కార్యక్రమమని చంద్రబాబు వెల్లడించారు. పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీ-4) అనేది రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సంపద సృష్టితో పాటు అన్ని వర్గాలకు పంచేలా పాలసీలు ఉండాలని పేర్కొన్నారు. పీ4 వంటి విధానాలతో 2047 నాటికి భారత్ నం.1 లేదా నం.2గా నిలుస్తుందని చంద్రబాబు వెల్లడించారు. పేదలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాలని చంద్రబాబు సూచించారు. అవసరమైన పాలసీలు తెస్తే పేదరికం లేని సమాజం సిద్ధిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికత మిళితం చేసి వివిధ రంగాల్లో 10 పబ్లిక్ పాలసీలు తేవాలని చంద్రబాబు సూచించారు.