ETV Bharat / bharat

Engineering Jobs : ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 553 ఎగ్జామినర్​ పోస్టులకు నోటిఫికేషన్​! - కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2023

Engineering Jobs 2023 : ఇంజనీరింగ్​ గ్రాడ్యుయేట్స్​కు శుభవార్త చెప్పింది దిల్లీలోని సీజీపీడీటీఎం. తమ సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన మొత్తం 553 ఎగ్జామినర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మరి ఈ పోస్టులకు ఎవరు అర్హులు, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ఏజ్​ లిమిట్​ ఎంత, దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు తదితర వివరాలు మీ కోసం..

CGPDTM Jobs 2023 Notification 1
టెక్నికల్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. సీజీపీడీటీఎంలో భారీ జాబ్స్​..
author img

By

Published : Jul 24, 2023, 12:56 PM IST

Updated : Jul 24, 2023, 1:07 PM IST

Engineering Jobs 2023 : దిల్లీలోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌, డిజైన్స్‌ అండ్‌ ట్రేడ్‌ మార్క్స్‌ (సీజీపీడీటీఎం), ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌, మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ.. 553 ఎగ్జామినర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్స్​ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. దీంట్లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వేస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు తుది ఎంపికలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ మూడు పరీక్షలూ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి.

మొత్తం ఖాలీలు..
CGPDTM Engineering jobs : 553 పోస్టులు

గెజిటెడ్‌ పోస్టులు..

  • ఫిజిక్స్‌- 30
  • కెమిస్ట్రీ- 56
  • మెటలర్జికల్‌- 04
  • బయోకెమిస్ట్రీ- 20
  • ఫుడ్‌ టెక్నాలజీ- 15
  • బయోటెక్నాలజీ- 50
  • సివిల్‌ ఇంజినీరింగ్‌- 09
  • టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌- 08
  • ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌- 29
  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌- 99
  • బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌- 53
  • పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- 09
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌- 108
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- 63

ఏజ్​ లిమిట్​..
CGPDTM Age Limit : 2023 ఆగస్టు 4 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఓబీసీలకు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

అప్లికేషన్​ ఫీజు..
CGPDTM Application Fees : దరఖాస్తు రుసుము జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000/-. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.500/-.

దరఖాస్తుకు చివరి తేదీ..
CGPDTM Last Date : 2023 ఆగస్టు 4.

ప్రిలిమినరీ పరీక్ష..
CGPDTM Exam Date : 2023 సెప్టెంబర్​ 3.

మెయిన్స్‌ పరీక్ష..
CGPDTM Exam Date : 2023 అక్టోబర్​ 1.

పరీక్ష విధానం..

  • CGPDTM Exam Mode 2023 : ప్రిలిమినరీ పరీక్ష- ఆన్​లైన్​
  • మెయిన్స్‌ పరీక్ష- ఆఫ్‌లైన్‌

ప్రిలిమినరీ పరీక్ష..
CGPDTM Prelims Syllabus : మొత్తం 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు. జనరల్‌ ఇంగ్లీష్‌(15 మార్కులు), వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌(30 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(30 మార్కులు), జనరల్‌ ఇంగ్లీష్​ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌(30 మార్కులు), జనరల్‌ సైన్స్‌(30 మార్కులు), ఐపీ లెజిస్లేషన్‌, వీఐపీఓ సంబంధిత అంశాలు(15 మార్కులు). పరీక్ష వ్యవధి 2 గంటలు. ఈ పరీక్షలో అన్‌రిజర్వ్​డ్ ​​అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 25 శాతం, ఇతరులు 20 శాతం కనిష్ఠ మార్కులు సాధించాలి. పోస్టుల సంఖ్యకు ఇరవై రెట్ల మందిని మెయిన్స్‌ పరీక్షకు ఎంపికచేస్తారు.

మెయిన్స్‌ పరీక్ష..
CGPDTM Mains Syllabus : పేపర్‌-1 ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో, పేపర్‌-2 డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. పేపర్‌-1 వంద మార్కులకు, పేపర్‌-2 మూడు వందల మార్కులకు.

  1. పేపర్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు 100 ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌కు(20 మార్కులు), జనరల్‌ ఆప్టిట్యూడ్‌(20 మార్కులు), ఎలిమెంటరీ మేథమెటిక్స్‌(20 మార్కులు), ఇంగ్లీష్​ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ(20 మార్కులు), ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌(20 మార్కులు). పరీక్ష వ్యవధి 2 గంటలు.
  2. టెక్నికల్‌/సైంటిఫిక్‌ విభాగంలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా పేపర్‌-2 ఉంటుంది. 300 మార్కులకు డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 3 గంటలు. అభ్యర్థుల తుది ఎంపికలో ఈ రెండు పేపర్లలో సాధించిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. పేపర్‌-2 సిలబస్‌ను విభాగాలవారీగా, వివరంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఆయా ఛాప్టర్లను క్షుణ్ణంగా చదువుకుంటే ఫలితం ఉంటుంది.
  3. పేపర్‌-2లో సమాధానాలను చేతిరాతతో స్పష్టంగా, అర్థమయ్యేలా రాయాలి. గజిబిజిగా, చదవడానికి వీల్లేని విధంగా సమాధానాలు రాస్తే వాటికి మార్కులు ఇవ్వరు. కనుక కొట్టివేతలు లేకుండా అర్థమయ్యేలా రాయడం అలవాటు చేసుకోవాలి. ఖాళీల సంఖ్యకు ఐదురెట్ల మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్ష నుంచి ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.

వెబ్​సైట్​..
CGPDTM Website : నోటిఫికేషన్​కు సంబంధించి అభ్యర్థులు సీజీపీడీటీఎం అధికారిక వెబ్​సైట్​ https://cgpdtm.qcin.org ను వీక్షించవచ్చు.

Last Updated : Jul 24, 2023, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.