కేంద్ర ప్రభుత్వ కొవిడ్ టీకా విధానం పౌరులను రెండు తరగతులుగా విభజించిందని కేరళ హైకోర్టు అక్షింతలు వేసింది. కొవాగ్జిన్ తీసుకున్నవారు ఒక వర్గమైతే, కొవిషీల్డ్ టీకా వేయించుకున్న వారిది రెండో వర్గమైందని వ్యాఖ్యానించింది. కొవాగ్జిన్ తీసుకున్నవారు ఇతర దేశాలకు పర్యటించే వీలు లేకుండా పోగా, కొవిషీల్డ్ తీసుకున్నవారు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగల (covaxin who approval) స్వేచ్ఛను అనుభవిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కున్హి కృష్ణన్ పేర్కొన్నారు.
సౌదీ అరేబియాలో వెల్డర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. పిటిషన్ దారుడు రెండు డోసుల కొవాగ్జిన్ వేసుకున్నారు. కానీ, దానికి సౌదీ అరేబియా గుర్తింపు (covaxin not allowed in other countries) లేకపోవడంతో, మూడో డోసుగా కొవిషీల్డ్ వేసుకోవడానికి అనుమతించాలని కేరళ హైకోర్టును అభ్యర్థించారు. "అంతర్జాతీయ గుర్తింపు ఉన్న టీకాను తీసుకుంటే కానీ ఆయన సౌదీకి వెళ్లలేరు. అక్కడ తిరిగి ఉద్యోగంలో చేరలేరు. దీనివల్ల పిటిషనర్ స్వేచ్ఛగా సంచరించే హక్కును కోల్పోయారు" అని హైకోర్టు పేర్కొంది. ఆయనకు వెంటనే మూడో డోసుగా కొవిషీల్డ్ వేయాలని తాము ఆదేశించలేమంటూనే, నెల రోజుల్లో ఆయన సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి:డేటా లీక్ కేసులో నేవీ అధికారులపై సీబీఐ ఛార్జిషీట్