రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 1.92 కోట్ల టీకాలు అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మే 16 నుంచి 31 మధ్యలో.. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు ముందస్తుగా సమాచారం ఇచ్చాకే టీకా డోసులు డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.
మొత్తంగా రాష్ట్రాలకు కోటి 62 లక్షల కొవిషీల్డ్ టీకాలు, 30 లక్షల కొవాగ్జిన్ టీకాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంది. 45 ఏళ్లు పైబడినవారికి ఈ టీకా డోసులు ఉపయోగించాలని ఆరోగ్య శాఖ తెలిపింది. మే 1 నుంచి 15 వరకు రాష్ట్రాలకు.. 1.7 కోట్ల వ్యాక్సిన్ డోసులు కేంద్రం ఉచితంగా ఇచ్చినట్లు పేర్కొంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి దేశంలో దాదాపు 18 కోట్ల మంది టీకా తీసుకున్నారు.